వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేరికా మరియు భారత సైన్యాలు కలిసి డాన్స్ చేసిన వేళ...! వీడియో

|
Google Oneindia TeluguNews

భారత సైనికులు మరియు అమేరికా సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియోను భారత సైన్యంలో ట్విట్టర్‌లో విడుదల చేసింది. అదికూడ అస్సాం రెజిమెంట్‌కు చెందిన ఓ పాటను పాడుతూ డాన్స్ చేయడం నెటిజన్లు ఆకర్షిస్తోంది. యూఎస్ఏలోని వాషింగ్టన్ లో భారత్ మరియు అమేరికా సైన్యాలకు చెందిన సైనికులకు ఉమ్మడి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. గత కొంత కాలంగా కొనసాగుతున్న శిక్షణ ఇండో-యూఎస్ రక్షణ సంస్థ సహాకారంతో నిర్వహిస్తున్నారు.

యుద్ద తర్ఫీదుల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, అనుభవం కోసం అమేరికాతో పాటు భారత సైన్యాలు శిక్షణ పొందుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉన్న అనుభావాను ఒకరికొకరు పంచుకుంటున్నారు. యుద్ద్ అభ్యాస్ శిక్షణ భారత్ మరియు యూఎస్ సైన్యాలకు శిక్షణ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తుందని భారత సైన్యాలు పేర్కోన్నాయి. దీంతో ఇరు దేశాలు శిక్షణలో భాగంగా పాటలు పాడుతూ,డాన్సులు చేస్తున్న దృశ్యాలను భారత సైనిక వ్యవస్థ ట్విట్టర్లో పోస్టు చేసింది.

 Indian and US soldiers dance and sing in unison during Exercise Yudh Abhyas

కాగా ఇరు దేశాల సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను ఇరుదేశాల నెటిజన్లు ప్రశంషిస్తున్నారు.ఇరు దేశాల సైన్యాలు కలిసి పాడుతూ, డాన్స్ చేయడం సంతోషాన్ని కల్గిస్తోందని పేర్కోన్నారు. కాగా అస్సాం రెజిమెంట్‌‌కు చెందిన బద్లూరామ్‌ను కీర్తీస్తూ ఆపాటను పాడారు. కాగా రెండవ ప్రపంచ యుద్దంలో బడ్లురామ్ అనే సైనికున్ని జపనీయులు చుట్టుముట్టినప్పుడు ఆయన చూపించిన ధైర్యసహసాలకు గౌరవసూచకంగా ఈ పాటను పాడతారని ఓ నెటిజన్ పేర్కోన్నాడు.

English summary
Soldiers from the Indian and the US armies are presently engaged in a joint military training program Exercise Yudh Abhyas - 2019, says a tweet by Indian Army. It’s conducted as a part of the ongoing Indo-US defence cooperation at Joint Base Lewis McChord, Washington, USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X