వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ‘ఎయిర్ స్ట్రైక్స్’, భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతం?

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై వైమానికి దాడులు చేసింది. గురువారం జరిపిన ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

భారత సరిహద్దులో తరచూ కాల్పులకు తెగబడి పౌరులు, సైనికుల ప్రాణాలు తీస్తున్న పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సుమారు 21 మంది భారత సైనికులతోపాటు పౌరులు కూడా మరణించారు.

 Indian army carrying out pinpoint air strikes on terror launchpads inside PoK: Report

ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు, లాంచ్‌ప్యాడ్‌లే లక్ష్యంగా భారత సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దాడుల్లో భారీ సంఖ్యలోఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే, భారత ఆర్మీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఈ దాడుల గురించి అధికారక ప్రకటన చేయలేదు.

కాగా, బుధవారం రాత్రి పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు గ్రెనెడ్లతో జరిపిన దాడుల్లో 8 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడి భారత భద్రత దళాలే లక్ష్యంగా జరిగినప్పటికీ.. తృటిలో ఈ దాడి నుంచి జవాన్లు తప్పించుకున్నారు.

ఇక గురువారం ఉదయం ఉగ్రవాదులు, భారత సైన్యానికి జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవానుకు గాయాలయ్యాయి. కాగా, సరిహద్దు వెంబడి, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేతను జవాన్లు కొనసాగిస్తున్నారు.

పీవోకేలో తాజాగా ఎలాంటి దాడులు చేయలేదు

అయితే, గురువారం పీవోకేలో ఇండియన్ ఆర్మీ వైమానిక దాడులు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి దాడులు ఏమీ చేయలేదని ఇండియన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ స్పష్టం చేశారు.

English summary
The Indian Army is carrying out "pinpoint strikes" on suspected terror launchpads inside Pakistan-occupied Kashmir in response to Pakistani military's unrelenting efforts to push maximum number of terrorists into India before the onset of harsh winters, sources in the security establishment said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X