• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రష్యన్ టెంట్లు,షక్కర్ పారా,మంచు నీరు... చలికాలానికి ఇండియన్ ఆర్మీ ఇలా సిద్దమవుతోంది...

|

చర్చల్లో పురోగతి లేదు... సరిహద్దులో ఉద్రిక్తతలకు ఇప్పటికిప్పుడు తెరపడే సూచనలేవీ కనిపించట్లేదు... మరోవైపు చలి కాలం రానే వచ్చింది... దీంతో భారత సైన్యం లదాఖ్‌లోని మంచు కొండల్లో తీవ్ర ప్రతికూల వాతావరణంలో చైనాను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అన్నింటికి మించి అక్కడి వాతావరణానికి అలవాటు పడటం పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులకు తట్టుకునేలా సైన్యం ఏర్పాట్లు చేసుకుంటోంది. టెంట్లు,నీళ్లుఆహారం ఇలా అన్నింటి విషయంలో ఇప్పుడే జాగ్రత్తపడుతోంది.

శిబిరాల కోసం రష్యన్ టెంట్లు

శిబిరాల కోసం రష్యన్ టెంట్లు

తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో వచ్చే వారం నాటికి మంచు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ వాతావరణంలో గన్స్,యుద్ద ట్యాంకులు పనిచేయవు. ఆ వాతావరణాన్ని తట్టుకుని ఉండగలగడం ఒకరకంగా మనిషి ఓపికకు పెద్ద పరీక్ష లాంటిదే. అయితే ఇండియన్ ఆర్మీ ముందు జాగ్రత్తతో అక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అక్కడి చలిని తట్టుకునేలా తమ శిబిరాలను నిర్మించుకోవడం కోసం రష్యన్ టెంట్లను కొనుగోలు చేస్తోంది. కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ టెంట్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో...

కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో...

ఇంతకుముందు భారత్‌ అక్కడ ప్రీఫాబ్రికేషన్ నిర్మాణాలను ఏర్పరుచుకోవడంలో సహాయం చేసిన కాంట్రాక్టర్లు ఎవరూ ప్రస్తుతం అందుబాటులో లేరని అధికారులు వెల్లడించారు. అందుకే ఇక్కడ సైబీరియా తరహా చలిని తట్టుకోవాలంటే రష్యన్ టెంట్లే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. పాంగాంగ్ త్సోతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా ఇప్పటికే సెమీ పర్మినెంట్ నిర్మాణాలను ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే.

షక్కర్ పారా... సూపర్ ఫుడ్...

షక్కర్ పారా... సూపర్ ఫుడ్...

ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించబడ్డ సైనికుల్లో ఒకరైన ఓ ఐటీబీపీ జవాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐటీబీపీ(ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్) జవాన్లకు ఇలా మంచు కొండల్లో విధులు నిర్వర్తించడం అలవాటే కాబట్టి... ఇక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుందన్నాడు. ఇక్కడి వాతావరణంలో 'షక్కర్ పారా' సూపర్ ఫుడ్ అని,దానిపై ఎక్కువగా ఆధారపడాలని వారు నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. గోధుమపిండి,పంచదార,నెయ్యి కలిపి చేసే ఈ స్నాక్ ఐటెం నార్త్ ఇండియాలో బాగా పాపులర్. ఈ స్నాక్‌ని తింటే... ఇందులో ఉంటే గోధుమపిండితో కడుపు నిండినట్లవుతుందని,పంచదారతో ఎనర్జీ వస్తుందని... అన్నింటినీ మించి,ఎక్కడికైనా సరే సులువుగా తీసుకెళ్లవచ్చునని, ఎక్కువరోజులు చెడిపోకుండా ఉంటాయని ఆ జవాన్ వివరించాడు.

  India-China Stand Off : China తో 14 గం. చర్చలు విఫలం..త్వరలోనే మరోసారి మిలటరీ స్థాయి చర్చలు!
  తాగునీరు ఎలా...

  తాగునీరు ఎలా...

  ఇక చలికాలంలో ఇక్కడి పర్వత ప్రాంతాల్లో నీళ్లకు కూడా తిప్పలే. ఇక్కడినుంచి కాస్త ముందున్న ఆర్మీ పోస్టుల్లో పైపుల ద్వారా భూగర్భ జలాలను అందించే ఏర్పాట్లు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చుశూల్ ప్రజల సహాయంతో ఇండియన్ ఆర్మీ తాగునీటి ఏర్పాట్లు చేసింది. అయితే చలికాలంలో పర్వతాలపై చాలావరకూ మంచునే ప్రధాన నీటి వనరుగా ఉపయోగించుకోవాలని ఆర్మీ భావిస్తోంది. హీటర్స్‌ను ఉపయోగించి మంచును కరిగించడం ద్వారా వచ్చే నీటినే తాగునీటిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటివరకూ దాదాపు 30వేల పైచిలుకు జవాన్లను భారత్ తూర్పు లదాఖ్‌లో మోహరించింది.

  English summary
  To tackle the winter conditions, Indian Army is procuring Russian tents. A source said the ordinance factory in Kanpur has been approached to procure these tents. China has constructed semi-permanent structures at Pangong and at other friction points of LAC. Officials explained that the lockdown meant some of the contractors who could have helped Indian army build pre-fabricated structures to house troops, were not available. The Russian tents which can withstand Siberia-like cold has been arrived at as the quickest and most effective alternative.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X