వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనస్ 40 డిగ్రీల చలిని తట్టుకునేలా: భారత్ యుద్ధ సన్నాహాలు?: చైనా సరిహద్దుల్లో భారీగా ట్యాంకులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత ఆర్మీ అనూహ్య చర్యలను తీసుకుంది. ఆ చర్యలు కాస్తా యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులను మోహరింపజేసింది. అక్కడితో ఆగలేదు- మైనస్ 40 డిగ్రీల చలిని సైతం తట్టుకునేలా, అత్యంత శీతల వాతావరణంలోనూ అవిశ్రాంతంగా సేవలను అందించే కోంబట్ వాహనాలను సరిహద్దులకు తరలించింది. దీనికి సంబంధించిన తాజా విజువల్స్‌ విడుదల అయ్యాయి.

లఢక్ ఈశాన్య ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద గల చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో ఆయా యుద్ధ ట్యాంకులను ఆర్మీ అధికారులు మోహరింపజేశారు. వాటిల్లో టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. వాటితోపాటు బీఎంపీ-2 ఇన్‌ఫాంట్రీ కోంబట్ వాహనాలను సిద్ధంగా ఉంచారు ఆర్మీ అధికారులు. అత్యంత ప్రతికూల వాతావరణంలో, మైనస్ 40 డిగ్రీల చలిని సైతం తట్టుకునే సామర్థ్యం ఈ బీఎంపీ-2 ఇన్‌ఫాంట్రీ కోంబట్ వాహనాలకు ఉంది.

Indian Army deploys T90 and T72 tanks along with Combat Vehicles near Line of Actual Control

ఇక ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చలి మరింత పెరుగుతుందని, అత్యంత శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా సామర్థ్యం ఉన్న వాహనాలను ముందస్తు జాగ్రత్త చర్యల కింద వాస్తవాధీన రేఖ వద్దకు తరలించినట్లు 14వ కార్ప్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అరవింద్ కపూర్ తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. భారీగా తుపాకులను సైతం వాస్తవాధీన రేఖ వద్దకు తరలిస్తున్నట్లు చెప్పారు.

Recommended Video

PM Modi Questions United Nations ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ || Oneindia Telugu

English summary
Indian Army deploys T-90 and T-72 tanks along with BMP-2 Infantry Combat Vehicles which can operate at temperatures up to minus 40 degree Celsius, near Line of Actual Control in Chumar-Demchok area in Eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X