వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో అలజడి...ఆరుమంది ఉగ్రవాదులను హతమార్చిన భారత్ సైన్యం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాక్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించాలని భావించిన చొరబాటు దారులు లేదా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. కీరన్ సెక్టార్ నుంచి చొరబడేందుకు వీరంతా ప్రయత్నించారు. గత 36 గంటల్లో 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు యత్నించారు. భారత సైన్యం వీరందరినీ మట్టుబెట్టింది. వీరి మృతదేహాలను లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే వదిలేసింది భారత సైన్యం. అయితే ఇప్పటి వరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నుంచి ఎవరూ రాలేదు.

pak infiltrator

ఇక మృతి చెందిన చొరబాటుదారుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. స్నైపర్ రైఫిల్, పాకిస్తాన్ మార్కింగ్స్ ఉన్న ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకుంది. ఈ బాంబులపై పాక్ మార్కులను చూస్తే ఆదేశం ఉగ్రవాదులను ఏ రకంగా ప్రోత్సహిస్తోందో స్పష్టంగా అర్థమవుతోందని భారత్ ఆర్మీ తెలిపింది. ఇలాంటి చొరబాట్లను కచ్చితంగా భద్రతాదళాలు ఎదుర్కొని మట్టుబెడతాయని సైన్యం హెచ్చరించింది. ఇదిలా ఉంటే పూంచ్ సెక్టార్‌లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. రాత్రి 8గంటల 15 నిమిషాలకు కాల్పులకు పాల్పడింది. పాక్ దాడులను భారత సైన్యం తిప్పి కొట్టింది.

ఇదిలా ఉంటే భారత్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బాంబులు విసిరిందని పాకిస్తాన్ ఆర్మీ అధికారి జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆరోపణలు చేశాడు. అంతేకాదు పీఓకే దగ్గర అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది పాకిస్తాన్. అంతేకాదు ప్రతి పాకిస్తానీయుడి రక్తంలో కశ్మీర్ తమదే అన్న భావం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అందుకే ఎంత కష్టమైన పోరాడి కశ్మీర్‌ను గెలుచుకుంటామని పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పాడు.ఇదిలా ఉంటే భారత్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ తలదూడ్చడం మంచిది కాదని భారత్ హెచ్చరించింది.

English summary
The Indian Army has foiled an infiltration attempt by a Pakistan's BAT (Border Action Team) squad in Keran Sector in the last 36 hours. Around 5-7 Pakistani army regulars, or terrorists, have been eliminated and their bodies are lying on the Line of Control and have not been retrieved yet due to heavy firing, the Northern Command of the Army said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X