వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడీయోలతో సహా బయటపెట్టిన భారత ఆర్మీ...!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పాకిస్థాన్ అనేక కుయుక్తులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే భారత్‌లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చొప్పించి భారత్‌లో శాంతిబద్రతలతో పాటు ఆర్ధిక గందరగోళాన్ని సృష్టించేందుకు ఆదేశం ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్థాన్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. పాకిస్థాన్ నుండి ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను హతం చేసిన సైన్యం, ఉగ్రవాదుల చొరబాటును వీడీయోలతో సహా బయటపెట్టింది.

లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...

భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాక్ యత్నం

పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భారత ఆర్మి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆగస్టు ఆయిదున కశ్మీర్‌కు ప్ర్యత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ తోపాటు రాష్ట్రాన్ని విభజించడంతో పాకిస్థాన్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.. కశ్మీర్‌లో ఉగ్రమూకలను చొరబాటు చేయించి అల్లర్లు సృష్టించాలనే కుట్రకు తెరలేపింది. దీంతో సైన్యం సహాకారం పలువురు ఉగ్రావాదులను ఆగస్టు మొదటి వారంలో భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు చొరబాటు దారులను అక్కడికక్కడే మట్టుబెట్టాయి. దీంతో పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ సైన్యం సైతం హతమయ్యారు.

 కెరాన్ సెక్టార్‌లో చొరబాటుదారులను హతం చేసిన భారత బలగాలు

కెరాన్ సెక్టార్‌లో చొరబాటుదారులను హతం చేసిన భారత బలగాలు

అయితే పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నిస్తున్న నేపథ్యంలోనే వారిని మట్టుబెట్టిన వీడీయోను విడుదల చేసింది. గత ఆగస్టులో మొదటి వారంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కెరాన్ సరిహద్దు వద్ద 5గురు ఉగ్రవాదులు చోరబాటుకు యత్నిస్తుంగా భారత దళాలు మట్టుబెట్టాయి. దీంతో వారి శవాలతో సహ భారత భద్రతా దళాలు వీడీయోలో బయటపెట్టాయి. ఇక ఈ సంఘటన తర్వాత ఎల్ఓసిలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసిన భారత సైన్యం పలువురు ఉగ్రవాదులను కూడ గుర్తించింది. దీంతో పలువురు పాకిస్థాన్ సైన్యంతోపాటు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

నెల రోజుల్లోనే 10 మంది పాక్ సైన్యం హతం

నెల రోజుల్లోనే 10 మంది పాక్ సైన్యం హతం

ఇప్పటికే పలువురు చొరబాటు దారులను భారత సైన్యం మట్టుపెట్టింది. ఉగ్రవాదులతోపాటు ఆగస్టు 5 నుండి ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తున్న పాకిస్థాన్ ఆర్మీ జవానులను కూడ 10 మందిని భారత దళాలు మట్టుపెట్టాయి. అయినా పాకిస్థాన్ మాత్రం భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటీ సాక్ష్యాలు లేక అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడ కేసును వేసేందుకు పాకిస్థాన్ వెనకడుగు వేసింది. ప్రస్థుతం భారత్ వద్ద ఆధారాలు ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ చొరబాట్లకు తెగబడుతుందనే వాదనతో భారత్ అంతర్జాతీయ సమాజానికి వివరించేందుకు సన్నహాలు చేస్తోంది.

English summary
The Indian Army has released video of the failed Pakistan Border Action Team (BAT) infiltration bid,The video of the incident from the first week of August recorded the events in Keran sector of Jammu and Kashmir days after the government announced its decision to abrogate Article 370.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X