వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సైనికులు... పాకిస్థాన్ సైన్యం వలే దేశభక్తి లేని వాళ్లు కాదు... పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌ విభజన అంశంలో అవకాశం ఎపుడు దొరుకుందా అనే అలోచనలో పాకిస్థాన్ ప్రధాన మంత్రితో పాటు అక్కడి మంత్రులు కూడ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ రాష్ట్ర సైనికులపై పాకిస్థాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విభజించి పాలించే విధంగా పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

Indian Army is a disciplined and nationalist force, unlike your Army

పాకిస్థాన్ భారత దేశాన్ని మరోసారి విభజించి పాలించు అనే సూత్రంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించిన పాకిస్తాన్, ఇరు దేశాల మధ్య వ్యాపార, మానవ సంబంధాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జమ్ము కశ్మీర్‌లో తమ వ్యూహాలు అమలు కాకపోవడంతో ఇప్పుడు పాకిస్థాన్ నాయకుల దృష్టి పంజాబ్ రాష్ట్రం పై పడింది.

ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ సైనికులు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ విధులు నిర్వహించేందుకు నిరాకరించాలని పాకిస్థాన్ మంత్రి ఫావద్ చౌదరి ట్విట్టర్లో పేర్కోన్నారు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. స్వతహాగా సైనికుడైన అమరిందర్ సింగ్ భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. భారత సైన్యం చాల క్రమశిక్షనణతో కూడికుని విధులు నిర్వహిస్తారని,రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైనికులపై పని చేయవని ఫైర్ అయ్యారు.

English summary
Punjab Chief Minister Captain Amarinder Singh slammed Pakistan minister Fawad Chaudhry's appeal to Punjabi soldiers to deny duty in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X