వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా చొరబాట్లు లేవు.. అధికారికంగా ప్రకటించిన ఆర్మీ

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజుల క్రితం చైనా భారత భూబాగంలోకి చొచ్చుకుని వచ్చిందంటూ బీజేపీ నేత ఆరుణచల్ రాష్ట్ర అధ్యక్షుడు,లోక్‌సభ సభ్యుడు అయిన తాపిర్ గావ్ వెల్లడించిన అంశాన్ని ఇండియన్ ఆర్మి కొట్టిపారేసింది. అలాంటీ చొరబాట్లు జరగలేదని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.ఇలాంటీ సంఘటనలు ఆర్మీ గుర్తించలేదని అన్నారు.

భారత్, చైనా, మయన్మార్ సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుకుని సుమారు వంద కిలోమీటర్లు పరిధిలో ఉన్న అన్ధాన్ జిల్లాలోని ఛగ్లగామ్ సమీపంలో అడవుల మధ్య గల డోయిమ్రు నదిపై చైనా సైనిక బలగాలు ఈ వంతెనను నిర్మించినట్టు తాపిర్ వెల్లడించారు.ఇందుకు సంబంధించిన కొన్ని వీడీయోలు ,ఫోటోలు సైతం మీడీయాకు విడుదల చేశాడు. దీంతో పలు మీడీయో కథనాలు కూడ వెలువడ్డాయి..

Indian Army on Wednesday issued an official statement denying the claims of BJP Arunachal MP

దీంతో అలర్ట్ అయిన సైన్యం దీనిపై విచారణ చేపట్టింది. చైనా భారత భూ భాగంలోకి చొచ్చుకు రాలేదని తెలిపింది. ఎంపీ తెలిపి తెలిపిన బ్రిడ్జి నిర్మాణం కూడ ఎక్కడ కనగోనబడలేదని సైన్యం తెలిపింది. దట్టమైన అడవుల ప్రాంతంలో నదుల వెంట వృక్ష సంపద ఉండడంతో పాటు నీటీ ప్రవాహాల వెంట పలువురు తిరుగుతారని అలాంటీ సంధర్భంలో ప్రజలు వంతనేలు నిర్మించి ఉండవచ్చని ఆర్మీ అధికారులు తెలిపారు.

స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తులతో వీరంగం సృష్టించాడు. దీంతో ప్రాధమిక పాఠశాలలో ఏం జరుగుతుందో తెలిసేలోపే రక్తపుటేరులు పారాయి. ఉన్మాది కత్తిపోట్లకు ఎనిమిది విద్యార్థులు బలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.

సెంట్రల్ చైనాలో ఈ దారుణం చోటుచేసుకుంది. హూబే ప్రావిన్స్‌లోని బైయాంగ్‌పింగ్ అనే ప్రాంతలో ఓ ప్రైమరీ పాఠాశాలలో కొత్త సెమిస్టర్ ‌లో స్కూల్ ప్రారంభమైన మొదటి అనగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు 40 సంవత్సరాలు ఉండే ఓ మాజీ ఖైదీ స్కూల్లోకి చొరబడి విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే దాడికి పాల్పడ్డ నిందితుడు గతంలో ఓ దుర్మార్గానికి ఒడిగట్టాడు. తన ప్రేయసిపై దాడి చేసి ఆమే కళ్లను పీకేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆకేసులో ఎనిమిది సంవత్సరాల పాటు జైలు జీవీతం అనుభవించి సంవత్సరం క్రితమే బయటకు వచ్చాడు.అయితే నిందుతుడు ఎందుకు ఈదాడి చేశాడనే కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఇదే ప్రాంతలో గత సంవత్సరం కూడ విద్యార్థులపై దాడులు జరిగాయి. ఏప్రిల్‌ నెలలో ఇద్దరు విద్యార్థులను పోడిచి చంపగా, జూన్‌లో కూడ తొమ్మిది మందిపై దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Indian Army on Wednesday issued an official statement denying the claims of BJP Arunachal MP that the Chinese Army intruded into Arunachal Pradesh's remote Anjaw district and constructed a bridge over a stream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X