వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండున్నర యుద్ధాలకు.. మేం సిద్ధం: భారత ఆర్మీ చీఫ్ రావత్

ఇప్పటికే కశ్మీర్ లో పాక్ తీవ్ర వాదులతో సగం యుద్ధం చేస్తున్నామని, ఒకవేళ పాకిస్తాన్ తోగాని, చైనాతోగాని ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వచ్చినా అందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లో కల్లోల పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్ లో అలజడికి పాకిస్తానే కారణమంని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. కశ్మీర్ యువతను పాకిస్తాన్ రెచ్చగొడుతోందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indian Army prepared for a two and a half front war: Army Chief Bipin Rawat

త్వరలోనే కశ్మీర్ లో పరిస్థితులు చక్కబడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యుద్ధమే గనుక వస్తే ఎదుర్కొనడానికి భారత సైన్యం ప్రతి క్షణం సన్నద్ధంగా ఉన్నట్లు బిపిన్ రావత్ పేర్కొన్నారు.

భారత సైన్యం రెండున్నర యుద్ధాలకు సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంటే.. ఇప్పటికే కశ్మీర్ లో పాక్ తీవ్ర వాదులతో సగం యుద్ధం చేస్తున్నామని, ఒకవేళ పాకిస్తాన్ తోగాని, చైనాతోగాని ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వచ్చినా అందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందనే అర్థం ఆయన వ్యాఖ్యల్లో ధ్వనిస్తోంది.

భారత సైన్యం ఆధునికీకరణకు సంబంధించిన పురోగతి బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామని బిపిన్ రావత్ పేర్కొన్నారు.

English summary
Chief of Army Staff General Bipin Rawat, in an interaction with ANI, said that the Indian Army is well prepared to face external, as well as internal threats to the country. Speaking to ANI General Bipin Rawat said, "Indian Army is fully ready for a two and a half front war". The Army Chief added that even though India is ready for a multi front war there are effective mechanisms available to defuse an adverse situation. "Even the PM has stated that for the last forty years not even a single bullet has been fired on the Indo-China border," said General Rawat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X