వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలు

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్.. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా అక్కడ నెత్తురు చిందని రోజంటూ లేదు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ఉగ్రకలాపాలు క్రమంగా తగ్గుతూ వచ్చినా.. ఉగ్రవాదుల ఏరివేత మాత్రం కొనసాగుతూనే ఉన్నది.. గడిచిన ఏడాది కాలంలో.. ఉత్తర కాశ్మీర్ గా పిలిచే వ్యాలీలో పెద్ద సంఖ్యలో ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి.. తాము నిర్వహించేది ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలే అయినప్పటికీ.. అందులో నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామంటోన్న భారత సైన్యం తాజాగా సంచలన ప్రకటన చేసింది.

మోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలుమోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలు

షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం

షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం

జమ్మూకాశ్మీర్ లో తరచూ ఎన్ కౌంటర్లు చోటుచేసుకోవడం, భద్రతా బలగాల చేతుల్లో ముష్కరులు అంతం కావడం సాధారణ విషయం. మెజార్టీ కేసుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తనప్పటికీ.. కొన్ని ఎన్ కౌంటర్లపై మాత్రం మృతుల కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటివాటిలో ‘షోపియాన్ ఎన్ కౌంటర్' ప్రధానమైనది. ముగ్గురు యువకులు చనిపోయిన ఆ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధమైనదని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక ఆధారాలు లభించాయని భారత్ ఆర్మీ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ - దుష్యత్ రాజీనామాకు ఒత్తిడి - బీజేపీకి మరో షాక్ తప్పదా?వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ - దుష్యత్ రాజీనామాకు ఒత్తిడి - బీజేపీకి మరో షాక్ తప్పదా?

ఆ జవాన్లపై చర్యలు..

ఆ జవాన్లపై చర్యలు..

‘‘షోపియాన్ ఎన్ కౌంటర్ పై పౌరసమాజం, సోషల్ మీడియా నుంచి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం కావడంతో అంతర్గతంగా దర్యాప్తు కమిటీ వేశాం. నాలుగు వారాల్లోనే ఆ కమిటీ తన తుది రిపోర్టును సమర్పించింది. దాని ప్రకారం.. సోఫియాన్ ఎన్ కౌంటర్ సమయంలో బలగాలు నిబంధనల్ని పాటించలేదని స్పష్టంగా తేలింది. తద్వారా సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం(ఏఎఫ్ఎస్‌పీఏ)ను వారు(జవాన్లు) ఉల్లంఘించినట్లయింది. అలాంటి(ఎన్ కౌంటర్) సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయంలో ఆర్మీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎన్ కౌంటర్ అయినాసరే, నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తప్పు చేసిన జవాన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఆర్మీ అధికార ప్రతినిది శుక్రవారం మీడియాకు వివరించారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది జూలై 18న షోపియాన్‌ జిల్లా అంషిపొర గ్రామంలో.. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని అధికారులు ప్రకటించారు. చనిపోయిన ముగ్గురిని ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహ్మద్ ఇబ్రార్ లుగా గుర్తించారు. పేర్లు, ఫొటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత మృతుల కుటుంబీకులు షాక్ కు గురయ్యారు. రాజౌరీ జిల్లాకు చెందిన ఆ ముగ్గురు యువకులు.. పని చేసుకుని బతకడం కోసం షోపియాన్ జిల్లాకు వచ్చారని వెల్లడైంది. దీనిపై సర్వత్రా ఆందోళన చెలరేగడంతో ఆర్మీ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించింది. నాలుగు వారాల విచారణ అనంతరం జులై 18నాటి షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధంగా జరిగిందనడానికి ప్రాధమిక ఆధారాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది.

Recommended Video

స్థానికులతో కలిసి భోజనం చేసిన అజిత్ దోవల్ (వీడియో)
నైతిక ప్రమాణాలు పాటిస్తాం..

నైతిక ప్రమాణాలు పాటిస్తాం..

షోపియాన్ ఎన్ కౌంటర్ ఘటనలో జవాన్లదే తప్పని ఆధారాలు లభించడంతో, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారత సైన్యం నైతిక ప్రమాణాలు పాటిస్తుందని, ఆ విషయంలో రాజీపడబోమని చెప్పడానికి షోపియాన్ ఘటనే తార్కాణమని ఆయన చెప్పారు. జవాన్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు ప్రాధమికంగా నిర్ధారణ అయినప్పటికీ.. చనిపోయిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, లేదా అనేదానిపైనా మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని, పారదర్శకత కోసం ఎప్పటికప్పుడు వివరాలను వెల్లడిస్తామని అధికారి పేర్కొన్నారు.

English summary
The Army has found “prima facie” evidence its troops violated powers under the Armed Forces Special Powers Act during an encounter in Kashmir’s Shopian district in which three men were killed in July this year and has initiated disciplinary proceedings, officials said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X