వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జవానును ముక్కలు చేసిన పాక్ ఉగ్రవాదులు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాక్ ఉగ్రవాదులు ఎంత నీచులంటే వీరమరణం పొందిన మన జవాను మణీందర్ సింగ్ (27) భౌతికకాయాన్ని ముక్కలుముక్కలుగా నరికి విసిరివేసి వెళ్లారు. ఉగ్రవాదులు నీచపు పనితో భారత జవాన్లు పగతోరగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చోవడానికి సిద్దం అయ్యారు.

తాము ప్రతీకారం తీర్చుకుని మా జవాను ఆత్మకు శాంతి కలిగించే వరకు నిద్రపోమని భారత జవాన్లు స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లోని కుష్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు.

అదే సమయంలో పాక్ సైన్యం కాల్పులతో చెలరేగిపోతుంది. అదే అదునుగా భావించిన ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదులను భారత సైన్యం అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదితో పాటు మన సైనికుడు మణిదీప్ సింగ్ (27) మరణించారు.

భారత్ దెబ్బకు ఉగ్రవాదులు తోకముడిచారు. తరువాత వీరమరణం చెందిన సైనికుడు మణీందర్ సింగ్ దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఉగ్రవాదులు పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి పారిపోయారు. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యతో భారత సైన్యం తీవ్రంగా స్పందించింది.

Indian Army vows revenge after terrorist kill, Mutilate Solider, cross LoC

ఉగ్రవాదులు భారత సైనికుడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన తరువాత పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి పారిపోయారు.
ఇది అత్యంత మేయమైన ఘటన. భారత సరిహద్దుకు అటువైపు ఉన్న అధికార, అధికారేతర గ్రూపుల అనాగరిక చర్యకు ఇది ప్రత్యక్ష సాక్షం. దీనికి తగిన రీతిలో అంతకంత బదిలిస్తాం అంటు శనివారం భారత సైన్యం స్పష్టం చేసింది.

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే యథేచ్చగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. మచిల్ సెక్టార్ లో సుభాష్ అనే మరో బీఎస్ఎఫ్ జవాను వీరమరణం పొందారు. ఇటీవల కొనసాగుతున్న పాక్ కాల్పులతో పలువురు బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

English summary
Sepoy Mandeep Singh who died in the attack was 27 years old, the army said. The attack took place under cover fire provided by Pakistan army. One terrorist was killed in the strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X