• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గత ఐదేళ్లలో పాక్‌పై జరిగింది రెండు కాదు... మూడు దాడులు: రాజ్‌నాథ్ సింగ్

|

మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది... మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి సర్జికల్ స్ట్రైక్స్ రెండోది పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు మాత్రమే. కానీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి విషయాలను వెల్లడించలేదు రాజ్‌నాథ్ సింగ్.

Indian forces carried 3 strikes in 5 years: Rajnath Singh in Karnataka

కర్నాటకలోని మంగళూరులో ఓ బహిరంగర్యాలీలో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్ మూడోసారి కూడా భారత్ పాకిస్తాన్‌పై దాడి చేసిందన్నారు.అయితే ఇది సరిహద్దు రేఖకు సమీపంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన దాడులని వెల్లడించారు. మూడుసార్లు సరిహద్దు రేఖ దాటి పాక్ భూభాగంలోకి భారత బలగాలు వెళ్లాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రెండు దాడులపై సమాచారం అయితే ఇవ్వగలను కానీ మూడోసారి జరిగిన దాడులపై మాత్రం ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేనని వెల్లడించారు.ఒక సారి ఊడి ఘటన, మరోసారి పుల్వామా దాడులకు ప్రతీకారంగా దాడులు చేశామని చెప్పిన రాజ్‌నాథ్ సింగ్ మూడో దాడులు గురించి ఏమి చెప్పలేనని స్పష్టం చేశారు.

"ఊరి ఘటనలో అంతా చూసే ఉంటారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 17 మంది జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఆ తర్వాత మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రెండోది పుల్వామా దాడుల తర్వాత జరిగింది. భారత్ అప్పటిలా లేదని... ఏదైనా దాడులు భారత భూభాగంపై వెంటనే ప్రతీకార దాడులు చేస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు. గత ప్రభుత్వాల వల్ల భారత్ బలహీనంగా మారిందని తమ ప్రభుత్వంలో దెబ్బకు దెబ్బ అనేలా వ్యవహరిస్తోందని చెప్పారు.

మోడీల కోసమే మోడీ... పేదల కోసం కాంగ్రెస్: రాహుల్ నోట కొత్త పథకం

ఎవరిపై అనవసరంగా దాడి చేయమని అదే సమయంలో ఎవరైనా దాడి చేస్తూ చూస్తూ ఊరుకోబోమని అన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఆర్మీ త్యాగాలను కొందరు గుర్తించడం లేదని వారికి రుజువులు కావాలంటూ రోడ్లపెకొచ్చి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌పై పరోక్షంగా మండిపడ్డారు రాజ్‌నాథ్ సింగ్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Home Minister Rajnath Singh in a public rally at Manguluru, Karnataka on Saturday claimed that Indian forces, apart from the surgical strike after the Uri terror attack and the air strikes in Pakistan's Balakot after Pulwama, carried out a "third strike" but stopped short of revealing the details.Singh also said that these “beyond the borders” operations were carried against terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more