వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఐటీలో భారీగా రిక్రూట్‌మెంట్లు, 550 కంపెనీల ఫోకస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఖచ్చితంగా ఇది తీపికబురే. వచ్చే ఆరు నెలల్లో ఐటీ సంస్థల భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. ప్రధానంగా జూనియర్ లెవల్ ఉద్యోగాలను పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తాయని ఎక్స్పర్టీస్ ఐటీ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే వెల్లడించింది.

నియామకాల ఊపు

నియామకాల ఊపు

అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణ నేపథ్యంలో భారత్‌లో గత కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

నియామకాలపై దృష్టి..

నియామకాలపై దృష్టి..

భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి సారించాయని పేర్కొంది.

జూనియర్ లెవల్‌లో..

జూనియర్ లెవల్‌లో..

ఐటీ కంపెనీలు జూనియర్ లెవల్‌లో నియామకాలను పెద్ద ఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనా దోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక వెల్లడించింది.

 550 ఐటీ కంపెనీలు..

550 ఐటీ కంపెనీలు..

కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్ ప్రణాళికలను సర్వే పేర్కొంది.

English summary
The Indian IT industry is bullish about its hiring plans for the next six months and a major chunk of these recruitments is expected to happen for the junior level, says a report. Corporate India's hiring intention is gearing up after the slowdown in the last few months due to the proposed visa restrictions in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X