వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 58 వేల మంది ఇంటికే: నియామకాల తగ్గింపుపై ఐటీ దిగ్గజాల దృష్టి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పశ్చిమ దేశాలు స్థానిక ఉపాధికి పెద్దపీట వేయడం, ఆటోమేషన్ ప్రభావం, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో భారత ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పశ్చిమ దేశాలు స్థానిక ఉపాధికి పెద్దపీట వేయడం, ఆటోమేషన్ ప్రభావం, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో భారత ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం సంధి దశకు చేరుకున్నది. ఆయా దేశాల విధానాలకు అనుగుణంగా స్థానిక నియామకాలకు పెద్దపీట వేయడం, సాంకేతికాభివృద్ధిలో భాగంగా ఆటోమేషన్ను అందిపుచ్చుకోవడం.. ఐటీ పరిశ్రమకు అనివార్యంగా మారింది.

ఈ క్రమంలో భారతదేశంలోనూ, విదేశాల్లోనూ భారత ఉద్యోగులను తగ్గించుకోవడం మొదలైందని, ఈ ఉద్వాసనలు మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని, కొత్త నియామకాలు తగ్గిపోతాయని ఐటీ, ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2016-17లో 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన భారత ఐటీ పరిశ్రమ ఐదు శాతం కొత్త ఉద్యోగులను నియమించుకున్నదని నాస్కామ్ వివరించింది.

అంతకుముందు ఏడాది ఆరు శాతం కన్నా ఇది తక్కువే. ప్రస్తుత సవాళ్ల మధ్య సమీప భవిష్యత్‌లో కొత్త ఉద్యోగుల నియామకాల సంగతి పక్కన బెడితే ఉన్న ఉద్యోగాలే హరించుకు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ సవాళ్లు ఎదురవుతుండటంతో వాటి నుంచి బయట పడేందుకు, తమ లాభాలు సజావుగా నిలుపుకునేందుకు ఉద్యోగాల్లో కోతలపై దృష్టిపెట్టాయి.

సాంకేతికత, ట్రంప్ తదితరాలు ఇలా కారణం

సాంకేతికత, ట్రంప్ తదితరాలు ఇలా కారణం

ఈ ఏడాది దాదాపు 58 వేల మంది ఉద్యోగులను ఏడు ఐటీ కంపెనీలు తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిల్లో విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజంట్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ కార్ప్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ, కాప్‌జెమినీ ఎస్‌ఏ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఇది గత ఏడాది తొలగింపులతో పోలిస్తే రెట్టింపు పైమాటే. దీనికి కంపెనీలు చాలా కారణాలు ఉన్నాయంటున్నాయి. మొదటిది, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిబంధనలకు అనుగుణంగా విధానాల మార్పిడిలో భాగంగా చర్యలు తీసుకోవడం తదితర అంశాలు అందుకు కారణాలుగా చెప్తున్నాయి.

శరవేగంగా క్షేత్రస్థాయిలో ఉద్వాసన ఏర్పాట్లు

శరవేగంగా క్షేత్రస్థాయిలో ఉద్వాసన ఏర్పాట్లు

ఈ కంపెనీల్లో దాదాపు 12.4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 4.7 శాతం ఉద్యోగులను ఈ ఏడాది తొలగించాలని భావిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఆ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని రెండు దిగ్గజ సంస్థల హెచ్‌ఆర్‌ అధిపతులు చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపునకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో శరవేగంతో ఏర్పాట్లుజరిగిపోతున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడు కంపెనీల్లో తొలగించ దలుచుకున్న ఉద్యోగులకు అతి తక్కువ రేటింగ్‌లు ఇచ్చాయి. కాగ్నిజంట్‌లో ఇప్పటికే 15 వేల మంది ఉద్యోగులకు బకెట్‌-4 రేటింగ్‌ను ఇచ్చింది. ఇక ఇన్ఫీలో 3,000 మంది సీనియర్‌ మేనేజర్లు పనితీరు మెరుగుపర్చుకోవాలని గుర్తించింది. ఇన్ఫోసిస్ మరోవైపు కొత్త నియామకాల్లో కూడా 60 శాతం కోత పెట్టింది. ఇంకొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకు వేశాయి. డీఎక్స్‌ టెక్నాలజీ వంటి సంస్థలు దేశంలోని కార్యాలయాల సంఖ్యను 50 నుంచి 26కు తగ్గించాలని భావిస్తున్నాయి. భారత్‌లోని 1,75,000 మంది ఉద్యోగుల్లో 10 వేల మంది వైదొలగాలని కోరనున్నది. అధికారికంగా ఇప్పటి వరకూ ఏ కంపెనీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించలేదు.

మెరుగు పడని వారిపై టెక్ మహింద్రా ఇలా

మెరుగు పడని వారిపై టెక్ మహింద్రా ఇలా

కానీ పనితీరు ఆధారంగా మదింపు నిర్వహిస్తుంటే మాత్రం నాసిరకమైన పనితీరు కనబర్చేవారి సంఖ్య పెరుగుతోందని ఆయా ఐటీ సంస్థలు అంటున్నాయి. దీనిపై కాగ్నిజెంట్‌ ప్రతినిధి మాట్లాడుతూ ‘మా సంస్థలో ఎటువంటి తొలగింపులు జరగలేదు. పనితీరు ఆధారంగా మదింపులు మాత్రం కొనసాగుతున్నాయి' అని తెలిపారు. ఇక, ఇన్ఫీ ప్రతినిధి మాట్లాడుతూ ‘మా పనితీరు నిర్వహణ విధానంలో భాగంగా మధ్యంతర మదింపుల ప్రక్రియను చేపడుతున్నాం' అన్నారు. ప్రతిభ ఆధారంగా కంపెనీ నుంచి వేరుపడే ఉద్యోగుల సంఖ్య ఏటా వేర్వేరుగా ఉంటుందని విప్రో ప్రతినిధి అంటున్నారు. డీఎక్స్‌సీ, హెచ్‌సీఎల్‌టెక్నాలజీస్‌ ప్రతినిధులు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించగా.. టెక్‌ మహీంద్రా మాత్రం సమర్థించుకున్నది. పనితీరు మెరుగుపడని వారినితొలగించడం ఏటా జరిగే ప్రక్రియే.. ఈ ఏడాది దానికి భిన్నంగా ఏమీ ఉండదని పేర్కొంది.

ఉద్యోగాలు కల్పిస్తామన్న టీసీఎస్

ఉద్యోగాలు కల్పిస్తామన్న టీసీఎస్

అన్ని సంస్థలకు భిన్నంగా టీసీఎస్ స్పందించింది. దేశంలోనే అత్యధికంగా టీసీఎస్‌లో 3,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఈ కంపెనీ మాత్రం ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై దృష్టిపెట్టలేదు. ఈ విషయాన్ని టీసీఎస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ఏడాది కంపెనీ నుంచి వీడిపోవాలని ఎవరిని అడగటంలేదని స్పష్టం చేశారు. కొత్త నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది.

యువత అవకాశాలు ఇక కల్లలేనా

యువత అవకాశాలు ఇక కల్లలేనా

గత రెండు దశాబ్దాలుగా 20 శాతానికి పైగా వస్తున్న భారత ఐటీ పరిశ్రమల లాభాలు తగ్గుతాయే కానీ.. ఆ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినబోవని నిపుణులు చెప్తున్నారు. కానీ.. భారత మధ్య తరగతి యువత ఐటీ కలలు, విదేశీ ఉద్యోగాల ఆశలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆటోమేషన్, ఇతరత్రా కారణాలతో మందగించిన కొత్త ఉద్యోగుల నియామకం మరింత మందగిస్తుంది. 2008-2010 మధ్య మాంద్యంలో తొలగింపుల కన్నా అధికంగా ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల ఉద్వాసన ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మధ్యశ్రేణి, సీనియర్ స్థాయి ఉద్యోగుల మీద తొలి దెబ్బ పడుతుందని, ఈ ఏడాది రెండో అర్థ భాగంలో జూనియర్ ఉద్యోగుల్లో కూడా భారీగా కోతలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

English summary
Donald Trump and other issues are effected on Indian IT industry. Seven Companies has ready send pink slips for their 58 thousand employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X