బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాది యాసీన్ భట్కల్ లొల్లి, బెంగళూరుకు వెళ్లాలి, 149 మంది హత్య, కెమెరా అంటే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనను బెంగళూరుకు తీసుకెళ్లాలని ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాసీన్ భట్కల్ పోలీసులను డిమాండ్ చేస్తున్నాడు. తాను కెమెరా ముందు నిలబడి వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ ఎదుర్కోలేనని ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదని యాసీన్ భట్కల్ లొల్లి చేస్తూ తీహార్ జైలు అధికారులకు లేఖ రాశాడు.

తీహార్ జైల్లో యాసీన్ భట్కల్

తీహార్ జైల్లో యాసీన్ భట్కల్

ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాసీన్ భట్కల్ మీద దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. యాసీన్ భట్కల్ ను అరెస్టు చేసిన పోలీసులు తీహార్ సెంట్రల్ జైలుకు తరలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చిన్నస్వామి స్టేడియం

చిన్నస్వామి స్టేడియం

బెంగళూరు నగరంలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర 2010 ఏప్రిల్ 17వ తేదీ వరస బాంబుపేలుళ్లు జరిగాయి. చిన్నిస్వామి స్టేడియం దగ్గర జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాసీన్ భట్కల్ ప్రముఖ నిందితుడు.

వీడియె కాన్పరెన్స్

వీడియె కాన్పరెన్స్

చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన వరుస బాంబుపేలుళ్ల కేసును బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైల్లో ఉన్న యాసీన్ భట్కల్ ను వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చెయ్యాలని నిర్ణయించింది. అయితే వీడియో కాన్పరెన్స్ విచారణకు యాసీన్ భట్కల్ నిరాకరిస్తున్నాడు.

నాకు ఇష్టం లేదు

నాకు ఇష్టం లేదు

కెమెరా ముందు నిలబడటం తనకు అలవాటు లేదని, భయం అని, వీడియో కాన్పరెన్స్ విచారణకు తాను అంగీకరించనని, బెంగళూరుకు తీసుకువెలితే కోర్టులో నేరుగా విచారణ ఎదుర్కొంటానని యాసీన్ భట్కల్ తీహార్ జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశాడు.

149 మందిని చంపిన క్రూరుడు

149 మందిని చంపిన క్రూరుడు

ఢిల్లీ, పూణే, వారణాసి, హైదరాబాద్, అహమ్మదాబాద్, బెంగళూరులో బాంబు పేలుళ్లు జరిపించిన యాసీన్ భట్కల్ 149 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాడు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిన యాసీన్ భట్కల్ కు వీడియో కెమెరా ముందు నిలబడాలంటే భయం అని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులు అంటున్నారు.

యాసిన్ భట్కల్ కు ఉరి శిక్ష

యాసిన్ భట్కల్ కు ఉరి శిక్ష

భారత్ లో విధ్వంసాలు సృష్టించి పాక్ లో యాసిన్ భట్కల్ తలదాచుకున్నాడు. 2013 ఆగస్టులో ఇండో-పాక్ సరిహద్దులో సంచరిస్తున్న భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసీన్ భట్కల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనేక కేసుల్లో యాసీన్ భట్కల్ నేరం చేశాడని రుజువుకావడంతో అతనికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

English summary
Yasin Bhatkal, the chief of the Indian Mujahideen is home-sick. Lodged in solitary confinement at the Tihar jail in Delhi, he has filed an application seeking to be taken to Bengaluru on a body warrant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X