దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: బాంబులు పెట్టిన అక్తర్ అరెస్టు

మోనుపై జాతీయ దర్యాప్తు బృందం 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. తాజా అక్తర్ అరెస్టుతో పేలుళ్ల కేసులో దాదాపు అందరి అరెస్టు అయినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తహసీన్ అక్తర్‌ను అరెస్టు చేశారు.
హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్‌లో బాంబులు పెట్టింది అక్తర్ అని చెబుతున్నారు. బాంబులు పెట్టిన అనంతరం అక్తర్ మంగళూరు మీదుగా బీహార్ రాష్ట్రానికి చేరుకున్నారు. యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలను ఇతనే చూసుకున్నాడు.
కాగా, రెండు రోజుల క్రితం ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురిని ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ ఎటిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నలుగురు అరెస్టు నేపథ్యంలో దేశంలో టెర్రర్ దాడులు జరగువచ్చునని పోలీసులు అనుమానించారు.












Click it and Unblock the Notifications