వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: బాంబులు పెట్టిన అక్తర్ అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Indian Mujahideen India commander Tehseen Akhtar alias Monu arrested by Delhi Police
ఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ తహ్సీన్ అక్తర్ అలియాస్ మోనును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మోను మూడో నిందితుడిగా ఉన్నాడు. బుద్ధ గయ, పాట్నా, ముంబయి పేలుళ్ల కేసుల్లోనూ మోను ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

మోనుపై జాతీయ దర్యాప్తు బృందం 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. తాజా అక్తర్ అరెస్టుతో పేలుళ్ల కేసులో దాదాపు అందరి అరెస్టు అయినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తహసీన్ అక్తర్‌ను అరెస్టు చేశారు.

హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్‌లో బాంబులు పెట్టింది అక్తర్ అని చెబుతున్నారు. బాంబులు పెట్టిన అనంతరం అక్తర్ మంగళూరు మీదుగా బీహార్ రాష్ట్రానికి చేరుకున్నారు. యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలను ఇతనే చూసుకున్నాడు.

కాగా, రెండు రోజుల క్రితం ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురిని ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ ఎటిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నలుగురు అరెస్టు నేపథ్యంలో దేశంలో టెర్రర్ దాడులు జరగువచ్చునని పోలీసులు అనుమానించారు.

English summary
The special cell of Delhi Police has arrested Tehseen Akhtar alias Monu, who is the commander of the India wing of terrorist group Indian Mujahideen. According to police, Akhtar was heading the Indian Mujahideen following the arrest of Yaseen Bhatkal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X