వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ తెచ్చిన తంటా: దుబాయ్‌లో ఇండియన్‌కు జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఫేస్ బుక్ లో మతవిద్వేష పూరిత సమాచారం పెట్టాడనే ఆరోపణపై ఒక భారతీయుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. అంతే కాకుండ జైలు శిక్ష పూర్తి అయిన తరువాత ఈ ఎన్ఆర్ఐని దేశం నుండి పంపించి వేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

దుబాయ్ లో నివాసం ఉంటున్న 41 సంవత్సరాల భారతీయుడు (ఎన్ఆర్ఐ)తన ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టుకున్నాడు. అందులో ఇస్లాం మతాన్ని, మహమ్మద్ ప్రవక్తను తిట్టాడని, తనకు వాట్సాప్ లో వచ్చిందని దుబాయ్ లో నివాసం ఉండే మరో భారతీయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Indian national has been sentenced to one year in jail

పోలీసులు కేసు నమోదు చేసి ఎన్ఆర్ఐని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫేస్ బుక్ స్టేటస్ పరిశీలించి భారతీయుడిని అరెస్టు చేశారు. దుబాయ్ లోని కోర్టులో కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తి ఇజ్జత్ అబ్దుల్ లాత్ కేసు విచారణ చేశారు.

భారతీయుడు ఇస్లాం మతాన్ని కించపరిచి మతవిద్వేష పూరితంగా తన స్టేటస్ పెట్టుకున్నాడని రుజువు అయ్యిందని ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నామని తీర్పు చెప్పారు. ఈ నెల జులైలో ఇరాక్ యుద్దం గురించి ఒక న్యూస్ బులెటిన్ చూసిన తరువాత భారతీయుడు తన ఫేస్ బుక్ స్టేటస్ లో అప్ డేట్ చేశాడు. 15 రోజులలో ఇతను కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

English summary
The Dubai Court of First Instance convicted him of blasphemy for a Facebook status he posted last July after reading a news bulletin about the Iraq war, according to a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X