వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయితో వల: పాకిస్థాన్ ఏజంటుగా మారిన ఇండియన్, ఏం జరిగిందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: డబ్బు, అందమైన అమ్మాయిలను ఎరవేసి తమకు అనుకూలంగా పాక్ మార్చుకొంటుంది. పాక్ పన్నిన కుట్రను భారత్ మరోసారి బట్టబయలు చేసింది. అమృత్‌సర్‌కు చెందిన రవికుమార్ అనే యువకుడు ఏకంగా పాక్ గూఢచారిగా మారాడు. రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

డబ్బు అందమైన అమ్మాయిలను వల వేసి పాకిస్థాన్ తమ ఏజంట్లుగా మార్చుకొంటుంది. అమృత్‌సర్‌కు చెందిన రవికుమార్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా లోబర్చుకొన్నారు. ప్రస్తుతం పాక్ తరపున రవికుమార్ ఐఎస్ఐ ఏజంటుగా పనిచేస్తున్నాడు.

Indian national spying for Pakistan’s ISI arrested in Amritsar

ఇంటలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా వచ్చిన సమాచారంతో పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయిని పాక్ ఐఎస్ఐ రవికుమార్‌కు వల విసిరింది. అమ్మాయి కారణంగా రవికుమార్ లొంగిపోయాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఐఎస్ఐ ఏజంట్లు రవికుమార్‌ను తమ ఏజంటుగా నియమించుకొన్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల వివరాలతో పాటు నిషేధిత ప్రాంతాలు, సరిహద్దులో సైన్యం కదలికలు, సైన్యానికి సంబంధించిన సమాచారం తదితర విషయాలపై పాకిస్థాన్‌కు సమాచారాన్ని పంపుతున్నారు. అంతేకాదు పాక్‌కు అవసరమైన సమచారాన్ని ఎప్పటికప్పుడు రవికుమార్ చేరవేస్తున్నాడని పోలీసులు ప్రకటించారు.

ఇంటర్నెట్ సహయంతో ఫోటోలు, ఎస్ఎంఎస్‌లు పంపేవాడు. అంతేకాదు పాక్‌లోని ఐఎస్‌ఐ ఏజంట్లతో రవికుమార్ తరచూ మాట్లాడేవాడని ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ కాల్స్ ‌ను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేశారు.

రవికుమార్ నాలుగు రోజుల పాటు దుబాయ్‌లో గడిపాడు నెల రోజుల క్రితం రవికుమార్ దుబాయ్‌ వెళ్ళివచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.అంతేకాదు దుబాయ్‌ నుండి రవికుమార్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. పక్కా ఆధారాలను సేకరించిన ఇంటలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.

స్థానిక పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేశారు ఈ మేరకు రవికుమార్ ఏ రకంగా ఐఎస్ఐ ఏజంటుగా మారారనే విషయమై విచారణ జరుపుతున్నారు. అమ్మాయిల పేరుతో నకిలీఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించి యువతను ఆకర్షిస్తున్నారు. కొందరు పాక్ ఉగ్రవాదుల వలలో పడుతున్నారు.

English summary
A man, who was allegedly working as a spy for Pakistani intelligence agencies, was on Thursday arrested in Amritsar by the State Special Operations Cell (SSOC) and Military Intelligence, the Punjab police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X