వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతపని చేస్తివి కరోనా.. వైరస్ వల్ల నౌకాదళ విన్యాసాలు వాయిదా.. 41 దేశాలకు ఆహ్వానం...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం 'మిలాన్' విన్యాసాలు నిర్వహించాలని అనుకొంది. విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా నిర్వహించేందుకు 41 దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది. అయితే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో విన్యాసాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్ 41 దేశాలను ఆహ్వానించింది. అందులో చైనా మాత్రం లేదు. ఇండోనేషియా, ఫ్రాన్స్, మొంజాబికా, సుడాన్, ఇజ్రాయెల్, ఖతార్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా, సోమాలియా, కెన్యా, ఈజిప్ట్, శ్రీలంక, వియత్నాం, మయన్మార్, న్యూజిలాండ్, అమెరికా, టాంజానియా, కమొరస్, మాల్దీవులు, బ్రూనై, ఫిలిప్పీన్స్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఒమన్, మౌరిటియస్, కంబోడియా, సింగపూర్, సౌత్ కొరియా, సౌతాఫ్రికా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, రష్యా, జిబౌటి, ఈరిట్రియా, బహ్రెయిన్, యూఏఈ, సెచిల్లీస్ దేశాలను ఇన్వైట్ చేసింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది.

Indian Navy biggest international exercise called off..

హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు 41 దేశాలను ఆహ్వానించింది. విన్యాసాలు చేసి నౌకాదళ విసృతి పెంచాలని ఇండియా అనుకొంది. కానీ కరోనా వైరస్ దానికి బ్రేక్ ఇచ్చింది. 1995లో ఇండియా నిర్వహించిన నౌకాళ విన్యాసాలకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హాజరయ్యాయి. దానికి క్రమంగా పెంచే సమయంలో.. వైరస్ రక్కసి దానికి తాత్కాలికంగా వాయిదా వేసింది.

English summary
Indian Navy's biggest exercise 'Milan', scheduled to be held this month in Visakhapatnam, was called off in the wake of coronavirus outbreak threat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X