వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ తోక జాడిస్తే... సౌత్ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకలు ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు శాంతి చర్చలంటూనే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా తన బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత్ కూడా అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తోంది. గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు దాడులకు పాల్పడిన ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే, చైనాకు కూడా భారీ నష్టమే జరిగింది.

Recommended Video

India - China : సైనిక చర్యలకు సిద్ధం.. South China Sea లో భారీ యుద్ధ నౌకను మోహరించిన Bharat !
ఏమాత్రం తగ్గని భారత్..

ఏమాత్రం తగ్గని భారత్..

ఈ నేపథ్యంలో భారత నావికా దళం కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా, సౌత్ చైనా సముద్రంలోకి ఓ భారీ భారత యుద్ధ నౌక ప్రవేశించింది. మన యుద్ధ నౌకల ప్రవేశాన్ని చైనా వ్యతిరేకిస్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం తగ్గడం లేదు. కాగా, ఇప్పటికే అమెరికా కూడా దక్షిణ చైనా సముద్రంలో తన కార్యకలాపాలను పెంచింది. దీంతో అమెరికాతో కూడా భారత్ సంప్రదింపులు జరుపుతోంది.

సౌత్ చైనా సముద్రంపై తమ ఆధిపత్యాన్ని చూపేందుకు అవకాశం లేకుండా పోతుండటంతో చైనా తాజా పరిణామాలపై ఆగ్రహంగా ఉంది.

సౌత్ చైనా ఎంతో కీలకంగా.. కానీ..

సౌత్ చైనా ఎంతో కీలకంగా.. కానీ..

తాజా కార్యకలాపాల నేపథ్యంలో చైనా.. భారత్‌తో జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేగాక, భారత యుద్ధ నౌకలు ప్రవేశించడంపై ఫిర్యాదు చేసింది.

చైనా ప్రభుత్వానికి సౌత్ చైనా సముద్రం అనేది చాలా కీలకంగా ఉంది. దీంతో మరే ఇతర దేశాలు కూడా ప్రవేశించడానికి వీల్లేదన్నట్లుగా చైనా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శత్రువులను పెంచుకుంటూ పోతున్న చైనాకు.. తాజా పరిణామం మింగుడు పడటం లేదు.

కవ్వింపు చర్యలకు దిగితే..

కవ్వింపు చర్యలకు దిగితే..

సరిహద్దులో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంట, సముద్ర మార్గం గుండా కూడా డ్రాగన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చైనా దళాలకు అన్ని రకాలుగా అడ్డుకునేందుకు ఎంతో కీలకమైన మలక్కా స్ట్రేట్స్ వద్దకు భారత యుద్ధ విమానాలు చేరుకున్నాయి. చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగిన సైనిక చర్య తీసుకుంటామని ఇప్పటికే భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Months after the Galwan Valley clash which left 20 Indian soldiers dead in eastern Ladakh, the India Navy has dispatched one of its frontline warships to the South China Sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X