ఇండియన్ నేవీలో 38పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: ఇండియన్ నేవీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా 38 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 18 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) (ఎడ్యుకేషన్), 20 పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్(లాజిస్టిక్స్) ఉన్నాయి. ఉద్యోగార్థులు జనవరి 20-ఫిబ్రవరి 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్, ర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్
ఖాళీల సంఖ్య: 38
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2018
జీతం వివరాలు: రూ. 56,100 - 1,10,700/-
విద్యార్హత: షార్ట్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు.. బీఎస్సీలో మ్యాథ్స్ లేదా ఎంఏ(ఇంగ్లీష్) లేదా బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇనిస్ట్రూమెంటేషన్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)తో (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్/మ్యాథ్స్/ఆపరేషనల్ రీసెర్చ్) కలిగి ఉండాలి.
పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్ అభ్యర్థులు బీఈ/బీటెక్(ఏదైనా) లేదా ఫస్ట్ క్లాస్‌తో ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ(ఐటీ) ఫస్ట్ క్లాస్, ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా/లాజిస్టిక్స్/సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ) కలిగి ఉండాలి.స
వయో పరిమితి: షార్ట్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు 02 జనవరి 1994 - 01 జనవరి 1998 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్ 02 జనవరి 1994 - 01 జులై 1999 మధ్య కాలంలో జన్మించి ఉండాలి(రెండు తేదీలు కలుపుకుని).
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20.01.2018
చివరి తేదీ: 10.02.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.