వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన భారత నావికా యుద్ద విమానం: ఇద్దరు గల్లంతు

|
Google Oneindia TeluguNews

గోవా: భారత నావికా దళానికి చెందిన యుద్ద విమానం (ఎయిర్ క్రాఫ్ట్) ప్రమాదవశాత్తు కూలిపోయిన సంఘటన గోవాలోని పనాజి తీరంలో జరిగింది. భారత నావికా దళానికి చెందిన పరిశీలకుడు, యుద్ద విమానం పైలట్ ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి ఒక అధికారి ప్రాణాలతో బయటపడ్డారు.

నావికా దళం అధికారులు సాటి సిబ్బిందికి పైలెట్ శిక్షణ, సముద్ర తీరంలో గస్తీలకు సంబంధించిన శిక్షణ ఇస్తుంటారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యుద్ద విమానంలో ముగ్గురు అధికారులు బయలుదేరారు. సౌత్-వెస్ట్ గోవాలోని 25 నాటికల్ మైళ్ల తీరంలో యుద్ద విమానం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తరువాత యుద్ద విమానం కూలిపోయిందని అధికారులు నిర్దారించుకున్నారు.

Indian Navy surveillance aircraft crashed

యుద్ద విమానం నుండి సంబంధాలు తెగిపోవడంతో నావికాదళ అధికారులు ఆందోళన చెందారు. యుద్ద విమానం నుండి ఒకరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతు అయిన ఇద్దరు అధికారుల కోసం నావికా దళం అధికారులు గాలిస్తున్నారు. యుద్ద విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.

English summary
An Indian Navy surveillance aircraft crashed about 25 nautical miles south-west off Goa with two officers on-board missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X