వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఆస్ట్రేలియాకు ఇక ఈజీగా...

ఆస్ట్రేలియా తీసుకున్న తాజా చర్యలతో ఆ దేశంలోని మరిన్ని విద్యా సంస్థల్లో చేరే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది. అంతేకాకుండా స్టూడెంట్‌ వీసా పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్య కూడా తగ్గుతుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు ఆకర్షణీయ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మన దేశానికి ఉన్న 'హై రిస్క్‌' అసెస్‌మెంట్ ను 'మోడరేట్‌ రిస్క్‌' కేటగిరీకి మార్చింది.

దీంతో మరిన్ని ఆస్ట్రేలియా విద్యా సంస్థల్లో చేరే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది. అంతేకాకుండా స్టూడెంట్‌ వీసా పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్య కూడా తగ్గుతుంది.

Indian? Now easily go to Australia for study

ఆస్ట్రేలియాలోని వర్సిటీలకు నాణ్యత ప్రాతిపదికన ర్యాంకింగ్‌ ఉంటుంది. దేశానికి ఇచ్చిన కేటగిరీ సంఖ్యను దరఖాస్తు చేసుకున్న వర్సిటీకి అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం మన దేశానికి ఇచ్చిన కేటగిరీతో భారత విద్యార్థులు ఎక్కువ వర్సిటీలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి.

2025 నాటికి 7,20,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను తమ వర్సిటీల్లో చేరేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అమెరికా, బ్రిటన్‌ తర్వాత ఆస్ట్రేలియాలోనే అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువగా ఉంటాయి.

స్టూడెంట్‌ వీసాల మంజూరుకు సంబంధించి వివిధ దేశాలను రిస్క్‌ ప్రాతిపదిక నాలుగు కేటగిరీలుగా ఆస్ట్రేలియా విభజించింది. కేటగిరీని బట్టి డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. ఉదాహరణకు హైరిస్క్‌ అసెస్‌మెంట్ కేటగిరీ కింద ఉన్న దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్‌ వీసా పొందేందుకు ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

భారత్‌ ఇప్పటి వరకు హైరిస్క్‌ విభాగంలో ఉండేది. దీంతో ఆస్ట్రేలియాలోని ఎక్కువ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను ఎంపిక చేసుకునే ఆప్షన్లు మన విద్యార్థులకు తక్కువగా ఉండేవి.

ఆస్ట్రేలియన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను ఇప్పుడు తగ్గించింది. అయితే సదరు దరఖాస్తుదారుడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డాక్యుమెంట్లను అడిగే అధికారం వీసా అధికారికి ఉంటుంది.

English summary
The Australian Government has included India in the Low Risk category (category-2). This will provide relief to Indian students. It will be easy for them to get admission in Australia‘s 40 universities. Visa rules of Indian students also have become simpler. Nepal and Sri Lanka are also in this category with India. In 2008, India was included into the High Risk category. Things were that the students of India could take visas only after easily enrolling in 8-10 Universities. These institutions also included University of Technology Sydney, Melbourne University, Royal Melbourne Institute of Technology, University of New South Wales among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X