వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ రష్దీని పొగిడినందుకు, ఇటుకతో ముఖంపై చితకొట్టారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన రచయితపై దాడి జరిగింది. జైనుబ్ ప్రియా దలా అనే రచయిత్రిని అతి కిరాతకంగా కొట్టారు. డర్బిన్‌లోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జైనుబ్ ప్రియా దలా, వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ ప్రశంసించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఈ సంఘటన గత వారం చోటుచేసుకుంది. జైనుబ్ ప్రియా దలా శనివారం తన 'వాట్ ఎబౌట్ మీరా' నవలను శనివారం విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆమె దాడిలో గాయపడటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Salman Rushdie

హోటల్ నుంచి ఆమె కారులో బయలుదేరగా, ముగ్గురు వ్యక్తులు మరో వాహనంలో వెంబడించారు. మార్గ మధ్యంలో ఆమె కారుని అడ్డగించి ఆమెపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించారు. ముగ్గురి దుండగుల్లో ఒకడు ఆమె మెడపై కత్తి పెట్టగా, మరో వ్యక్తి ఆమె ముఖంపై ఇటుకతో కొట్టాడు.

దీనిపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్టీ స్పందించారు. ఇది భయానకమైన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఆమె త్వరగా కొలుకోవాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు.

సల్మాన్ రష్దీ రచించిన రచనలు ఇస్లాంకు వ్యతిరేకమని, అతనిపై ప్రపంచ వ్యాప్తంగా ఫత్వా విధించిన సంగతి తెలిసిందే.

English summary
An Indian-origin author in South Africa was brutally assaulted and verbally abused after she praised controversial writer Salman Rushdie whose work has angered Muslims around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X