వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: బ్రిస్బేన్‌లో భారత డ్రైవర్‌ సజీవదహనం

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన 29ఏళ్ల బస్సు డ్రైవర్‌‌ మన్‌మీత్‌ అలీషర్‌ను సజీవదహనం చేశాడు ఓ దుర్మార్గుడు. ప్రయాణికులు చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

ప్రయాణికుల్లో ఒకరు మన్‌మీత్‌పై మండే స్వభావం ఉన్న ద్రవం పోసి నిప్పంటించారని తెలిపారు. మన్‌మీత్‌ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Indian origin bus driver burnt alive in Brisbane

కాగా, బ్రిస్బేన్‌లోని పంజాబీ ప్రజల్లో మన్‌మీత్‌ ప్రముఖ గాయకుడిగా పేరొందాడు.
ఈ ఘటన జాతి వివక్షకు సంబంధించినదిగా కనిపించట్లేదని స్థానిక పోలీస్‌ కమిషనర్‌ ఐయాన్‌ స్టీవార్ట్‌ వెల్లడించారు. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని.. బస్సు పూర్తిగా కాలిపోలేదని తెలిపారు.

అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి బస్‌స్టాప్‌లో 48ఏళ్ల అనుమానిత వ్యక్తిని అరెస్ట్‌ చేసి కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మన్‌మీత్ మృతి పట్ల బ్రిస్బేన్‌లోని పంజాబ్ కమ్యూనిటీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అతను తన విధులు నిర్వహిస్తూనే కమ్యూనిటీలో అవసరమైన వారికి సహాయం చేసేవాడని వెల్లడించాయి. ఓ దుర్మార్డుడి చర్య వల్ల ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
In a horrific incident, a 29-year-old Indian-origin bus driver was on Friday burnt to death when a man poured flammable liquid on him in front of several shocked passengers in Australia’s Brisbane city, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X