వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యుడి పాడు బుద్ధి... చికిత్సకు వచ్చిన మహిళలపై కన్నేసి...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: రోగులకు వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన మహిళా రోగులపై కన్నేశాడు. వారిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ వైద్యుడికి గురువారం కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

జస్వంత్ రాథోడ్ అనే భారత సంతతి వైద్యుడు బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని డుడ్లీలో కేస్టర్ మీడోస్ సర్జరీ అనే ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. 2008 నుంచి 2015 మధ్య కాలంలో నలుగురు మహిళా పేషంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Indian-origin doctor jailed for sex assault on patients in UK

ఈ కేసును ఏడు వారాలపాటు విచారించిన వోల్వెర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టు చివరికి జస్వంత్‌ రాథోడ్‌ను దోషిగా తేల్చింది. ఒక డాక్టర్‌గా అతడిపై పేషెంట్లు పెట్టుకున్న నమ్మకాన్ని అతడు వమ్ము చేశాడని ఆక్షేపించింది. 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మైఖేల్ చలినర్ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన రోగులను లైంగికంగా వేధించి వ్యక్తిగత జీవితాన్ని సంతృప్తి పరచడానికి ఉపయోగించుకోవడం నేరమని పేర్కొంటూ అతడికి జైలు శిక్ష విధించారు.

English summary
An India-born doctor was on Thursday sentenced to 12 years in prison for sexually assaulting four women patients at his UK surgery between 2008 and 2015.Jaswant Rathore was found guilty of conducting unnecessary massages on the patients at his Castle Meadows Surgery in Dudley, in the West Midlands region of England. The 60-year-old, who had moved to Britain with his family at the age of three, was also placed on the sex offenders' register indefinitely and made the subject of a 15-year sexual harm prevention order at the end of the hearing at Wolverhampton Crown Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X