వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టు: బ్యాంకులకు రూ.270 కోట్లు ఎగనామం పెట్టాడు...పెళ్లి అతిథి ముసుగులో పారిపోవాలని చూశారు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రూ.270 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జెనికా గ్రూప్ సంస్థ తండ్రీ కొడుకులు పెళ్లికి వచ్చిన అతిథుల ముసుగులో దేశం దాటి పారిపోవాలని చూస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై బుధవారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వత లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తండ్రీ కొడుకులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

భారత సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తులు రష్పాల్ టాడ్, మందిర్ సింగ్ తండ్రీ కొడుకులు. ప్రముఖ కార్ల కంపెనీ ఆడికి భారత్‌లో వీరు డీలర్లు. ఢిల్లీ, గురుగ్రామ్‌లలో వీరికి షో రూమ్‌లున్నాయి. అధికారిక లెక్కలు ప్రకారం ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 700 మంది. జెనికా గ్రూప్ ఐదు ఆడి మరియు పార్ష్ షోరూమ్‌లున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర రుణం తీసుకుని ఎగవేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడి రూ.270 కోట్లు రుణం పొందారు. ఇదే పద్ధతిలో మరో రెండు బ్యాంకులను కూడా మోసం చేశారు.

Indian Origin father son arrested for duping bank of Rs.270 crore

రష్పాల్ సింగ్‌కు లోన్లు ఇవ్వడంలో సహకరించిన బ్యాంకు అధికారులను కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసుల వద్ద నేరం అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మూడ్రోజుల పాటు వారు కస్టడీలో ఉంటారని పోలీసులు తెలిపారు. అనంతరం డిజిటల్ ఫుట్ ప్రింట్లు, వారి ఈమెయిళ్లను తనిఖీలు చేస్తామని చెప్పారు. ఇతర స్థలాలు, షోరూమ్‌లలో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

English summary
Wanted for allegedly duping banks of nearly Rs 270 crore, the father-son duo who run the Zenica Group that deals in high-end luxury cars, had reportedly posed as wedding guests while trying to escape from India, police officials said.The Delhi Police had registered a case against them on Wednesday and lookout notices were issued by security agencies at airports across the country. Police officials said the two were caught on Thursday at the departure terminal of the Indira Gandhi International (IGI) Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X