వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారుడి అంత్యక్రియలను ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో: కడసారి చూపునకు నోచుకోని తల్లిదండ్రులు..!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: విషాదాల్లోకెల్లా విషాదకర ఘటన ఇది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడిని కడసారి కూడా చూసుకోలేకపోయిన దైన్యాన్ని ఎదుర్కొన్నారు ఆ తల్లిదండ్రులు. కుమారుడికి అంతిమ వీడ్కోలు పలకలేని ఆవేదనను అనుభవించారు. కరోనా వైరస్ వల్ల విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో స్వస్థలానికి చేరుకోలేకపోయారు. తమ కుమారుడి మృతదేహానికి నిర్వహించిన అంత్యక్రియలను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తిలకించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకిందంటూ ప్రచారం: డాక్టర్ల పరీక్షలు: ఢిల్లీ ప్రార్థనలతో లింకువైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకిందంటూ ప్రచారం: డాక్టర్ల పరీక్షలు: ఢిల్లీ ప్రార్థనలతో లింకు

 షార్జలో నివసిస్తూ.. కేన్సర్ బారిన

షార్జలో నివసిస్తూ.. కేన్సర్ బారిన

కేరళలో చోటు చేసుకున్న ఘటన ఇది. మృతుడి పేరు జ్యుయల్ జొమాయ్. వయస్సు 16 సంవత్సరాలు. కేరళలోని పత్తినంథిట్టకు చెందిన జ్యుయల్ తన తల్లిదండ్రులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో నివసిస్తున్నాడు. షార్జాలోని జెమ్స్ మిలీనియం స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. జ్యుయల్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఏడేళ్ల కిందట అతను కేన్సర్ బారిన పడ్డాడు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు.

విమాన సర్వీసులు రద్దు కావడంతో..

విమాన సర్వీసులు రద్దు కావడంతో..

పరిస్థితి విషమించడంతో అతణ్ని దుబాయ్‌లోని అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నాలుగు రోజుల కిందట మరణంచాడు. జ్యుయల్ మృతదేహానికి తమ స్వస్థలం పత్తినంథిట్టలో అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల్లోనూ అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల విమాన సర్వీసులు రద్దయ్యాయి.

కార్గో విమానంలో మృతదేహం..

కార్గో విమానంలో మృతదేహం..


షార్జా అధికారుల చొరవతో తమ కుమారుడి మృతదేహాన్ని కార్గో విమానంలో పత్తినంథిట్టకు పంపించారు. అతని తల్లిదండ్రులు గానీ, సోదరులు గానీ రాలేకపోయారు. గురువారం జ్యుయల్ మృతదేహం పత్తినంథిట్టకు చేరుకుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. అతని మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. తల్లిదండ్రులు, సోదరులు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దీనితో షార్జాలోని సెయింట్ మేరీస్ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ కుమారుడి అంత్యక్రియలను ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తిలకించారు. తమ కుమారుడికి అక్కడి నుంచే కడసారి వీడ్కోలు పలికారు.

అంత్యక్రియలను తిలకించిన పది వేల మంది..

అంత్యక్రియలను తిలకించిన పది వేల మంది..

జ్యుయల్ మృతదేహానికి నిర్వహించిన అంత్యక్రియలను ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల సుమారు 10 వేల మంది తిలకించారు. నివాళిని అర్పించారు. ఇలాంటి దుస్థితి ఏ తల్లదండ్రులకు రాకూడదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని పత్తినంథిట్టలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. జ్యుయల్ తండ్రి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు.

Recommended Video

Son Carries Father On Shoulders After Police Stops Vehicle Amid Lockdown, Video Viral

English summary
An Indian family in the UAE had to watch the funeral of their cancer-stricken son on Facebook as they could not accompany his body flown to their native state of Kerala due to COVID-19-related travel restrictions. Born on Easter in 2004, Jeuel G. Jomay lost his seven-year-long battle with cancer this Good Friday, a day before he turned 16 on April 11. A grade 10 student of GEMS Millennium School in Sharjah, Jeuel breathed his last in American Hospital in Dubai, where he was admitted two weeks earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X