వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ .. రద్దీ అధికంగా ఉండే రూట్స్ లో క్లోన్ ట్రైన్స్.. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారతీయ రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దేశంలో క్లోన్ ట్రైన్స్ ( సమాంతర రైళ్ళు) ను నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. అధిక డిమాండ్ ఉన్న మార్గాలలో, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న రూట్లలో ఈ రైళ్లను నిర్వహించనున్నట్లు గా రైల్వే బోర్డు చైర్మన్ వి కే యాదవ్ అన్నారు.

సందర్శకుల కోసం తెరుచుకోనున్న తాజ్ మహల్ .. ఎప్పుడంటే సందర్శకుల కోసం తెరుచుకోనున్న తాజ్ మహల్ .. ఎప్పుడంటే

 డిమాండ్ ఉన్న మార్గాలలో క్లోన్ ట్రైన్స్ నడపాలని నిర్ణయం

డిమాండ్ ఉన్న మార్గాలలో క్లోన్ ట్రైన్స్ నడపాలని నిర్ణయం

ప్రతిపాదిత రూట్లలో డిమాండ్ మేరకే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వారి గమ్య మార్గాలకు చేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. సాధారణ రైళ్ళతో పోలిస్తే క్లోన్ ట్రైన్స్ కు హాల్టింగ్ పాయింట్లు తక్కువగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కారణంగా ప్యాసింజర్ రైలు విభాగంలో ఆదాయాలు క్షీణించిన నేపథ్యంలో భారతీయ రైల్వే ఆదాయాన్ని పెంచడానికి క్లోన్ రైళ్లను నడపడం ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది అని రైల్వే శాఖ భావిస్తోంది.

దశల వారీగా క్లోన్ ట్రైన్స్ ప్రారంభించనున్న రైల్వే

దశల వారీగా క్లోన్ ట్రైన్స్ ప్రారంభించనున్న రైల్వే

వచ్చే 15 రోజుల్లో ఈ క్లోన్ రైళ్లను దశలవారీగా ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది.
రైలు ఆక్యుపెన్సీ పర్యవేక్షిస్తున్న అధికారులు, ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రాంతాలకు, ముఖ్యంగా పది రోజులకు పైగా వెయిటింగ్ లిస్టు ఉన్నచోట క్లోన్ రైళ్లను నడపనున్నట్లు గా తెలుస్తుంది. క్లోన్ లేదా డూప్లికేట్ రైళ్ళు ఇప్పటికే ఉన్న రైళ్ళ కంటే ముందుగానే నడుస్తాయి. ఇక దీని వల్ల ప్రత్యేక రైలు కోసం వెయిటింగ్ లిస్టు ఉండదు అంటూ అధికార యంత్రాంగం చెబుతోంది.

రైల్వే ఆదాయం పెరుగుతుందనే ఈ నిర్ణయం

రైల్వే ఆదాయం పెరుగుతుందనే ఈ నిర్ణయం

రైళ్లను నిర్వహించకుండా ఖాళీగా ఉంచటం కంటే ,అధికంగా డిమాండ్ ఉన్న మార్గాలలో రైలు నడపడం మంచిదని భావిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో రైల్వే ఆదాయం పెరుగుతుందని భావన . మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా భారత రైల్వే అన్ని ప్యాసింజర్ రైలు సేవలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే కు తీవ్ర నష్టం వచ్చింది. ఆ తర్వాత మీ 1 నుండి వలస కార్మికుల ను తమ సొంత రాష్ట్రాలకు తరలించడం కోసం శ్రామిక స్పెషల్ రైళ్లను రైల్వే నిర్వహించింది.

కరోనా కారణంగా దెబ్బ తిన్న రైల్వే ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్లాన్

కరోనా కారణంగా దెబ్బ తిన్న రైల్వే ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్లాన్


తర్వాతి కాలంలో 230 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. సెప్టెంబర్ 12 నుండి మరో 80 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు కొన్ని అదనపు రైళ్లను కూడా ప్రకటించింది. ఇక వీటితో పాటు సమాంతర రైళ్లను కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం రైల్వే శాఖకు మరింత లాభించే అంశం. ఈ చర్య రైల్వే ఆదాయాన్ని బాగా పెంచుతుంది అని అధికారులు భావిస్తున్నారు.

కరోనా కారణంగా కుదేలైన రైల్వే ఆదాయానికి ఈ క్లోన్ ట్రైన్స్ ఆర్ధిక ఊతం ఇస్తాయని భావిస్తున్నారు. రైల్వే ఆదాయాన్ని గాడిలో పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది .

Recommended Video

India's GDP Shrinks -23.9%, 1996 నుండి ఎప్పుడూ లేనంతగా | V Shaped Recovery || Oneindia Telugu

English summary
In a first, Indian Railways will soon run ‘clone’ or duplicate trains on high-demand routes for waitlisted passengers. The proposed step will not only ensure availability of on-demand trains, but also help the national transporter boost revenues at a time when the passenger segment earnings declined due to the covid-19 outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X