వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేను వీడని నిర్లక్ష్యం : ఒకే ట్రాక్ పై ఎదురుగా వచ్చిన రైళ్లు... తృటిలో తప్పిన ప్రమాదం

|
Google Oneindia TeluguNews

ఎంత ఆధునిక టెక్నాలజీ వచ్చినా రైల్వే శాఖ ఆధికారులు కొంతమంది తమ నిర్లక్ష్యాన్ని మాత్రం వీడడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో రైళ్ల అలస్యం అటుంచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇతర దేశాల్లో గంటకు మూడు నాలుగు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంటుంటే మన దేశంలో మాత్రం రైలు కోసం ఇంకా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను ఆధునీకరిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అధికారుల నిర్లక్ష్యంతో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి. అయితే అప్రత్తమైన లోకో పైలట్ లు రైళ్లను ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

రెండు రోజుల క్రితం తమిళనాడులోని మధురై పరిధిలో ఈ సంఘటన జరిగింది.మధురై -సెంగొట్టి ప్యాసింజర్ శుక్రవారం సాయంత్రం మధురై నుండి నుండి బయలు దేరింది. అక్కడి నుండి పది నిమిషాలు ప్రయాణించి తిరుమంగళం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయితే సిగ్నల్స్ లేకపోవడంతో డ్రైవర్ గంటపాటు అక్కడే రైలును నిలిపివేశాడు. దీంతో అసహహానానికి గురైన ప్రయాణికులు రైల్వే స్టేషన్ మాస్టర్ తో ఘర్షణకు దిగారు . దీంతో మరో పదినిమిషాల తర్వాత సిగ్నల్ లభించింది.

Indian railway officials do not let their negligence

ఈనేపథ్యంలోనే రైలు కదిలింది. రైలు కొద్ది దూరం వెళ్లిందో లేదో అదే ట్రాక్ ఎదురుగా మధురైకి వచ్చే రైలు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రెండు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పైలట్లు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా వేలాది మంది దుర్గతిపాలు అయ్యె అవకాశాలు ఉండేవి. ఈ సంఘటనతో అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఇద్దరు స్టేషన్ మాస్లర్ల తోపాటు మరో అధికారిని సస్పెండ్ చేశారు అధికారులు .

English summary
Indian railway officials do not let their negligence. because the railway accidents are continuing, recently two trains run on the same track by oppoisite in tamilanadu state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X