వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్రికన్ క‌ృపయా ధ్యాన్ దే : 4 గంటల ముందే ఎక్కాల్సిన, దిగాల్సిన స్థానం మార్చుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రిజర్వేషన్ ప్యాసెంజర్స్ తాము ఎక్సాల్సిన రైల్వేస్టేషన్ 4 గంటల ముందు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇది గతంలో 24 గంటల ముందు మార్చుకునే వీలుండేది. దానిని కుదించడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారింది. ఈ కొత్త విధానాన్ని మే 1 నుంచి అమలుచేస్తామని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల వేళ మరో సారి రాహుల్ పెళ్లి గోల.. సప్నా చౌదరిని పెళ్లి చేసుకోవాలంటున్న బీజేపీ ఎన్నికల వేళ మరో సారి రాహుల్ పెళ్లి గోల.. సప్నా చౌదరిని పెళ్లి చేసుకోవాలంటున్న బీజేపీ

తొలుత శతాబ్ది, రాజధానిలో అమలు

తొలుత శతాబ్ది, రాజధానిలో అమలు

ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, రైల్వేస్టేషన్ కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసేవారికి ఈ ప్రయోజనం లభిస్తోంది. ఐఆర్సీటీసీలో బుక్ చేసిన వారు సైట్ లో తమ గమ్యస్థానం ఏదో తెలియజేయాల్సి ఉంటుంది. కౌంటర్ లో టికెట్ కొన్న ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తమ గమ్యస్థానం డిటైల్స్ ఇవ్వాలి. దీంతోపాటు తత్కాల్ టికెట్ల‌కు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. అయితే ప్రయాణించే సమయంలో రెండుసార్లు మాత్రమే మార్చుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్టు పేర్కొన్నది. తొలుత శతాబ్ధి, రాజధాని రైళ్లలో ఈ ప్రాజెక్టు చేపట్టి ... తర్వాత మిగతా రైళ్లలో ప్రవేశపెడతామని ఆ శాఖ అధికారులు తెలిపారు. తమ గమ్యస్థానాన్ని మార్చుకొని .. రైలును చేరుకోలేకపోతే టికెట్ చార్జీనీ రీఫండ్ చేయబోమని స్పష్టంచేశారు.

 ఖాళీ వివరాలు తెలుసుకోవచ్చు ?

ఖాళీ వివరాలు తెలుసుకోవచ్చు ?

రైల్వేశాఖ ప్రకటన తర్వాత ఆధునీకరించిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఆవిష్కరించారు. దీంతో ప్రయాణికులు రిజర్వేషన్ చార్ట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ లను కూడా చూసే అవకాశం ఉంటుంది. దీంతో టికెట్ కలెక్టర్ వెబ్ సైట్ ఆధారంగా ఆ మార్గం గుండా రైలు బెర్తులలో మార్పులు చేస్తారు. దీంతోపాటు రెండో చార్ట్ కూడా పొందుపరుస్తారు. అందులో రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు కనిపిస్తాయి. దీంతోపాటు రిజర్వేషన్ ప్రక్రియ బెర్త్, కోచ్‌ల వివరాలను గ్రాఫికల్ విధానంలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

 విమానం మాదిరిగా రిజర్వేషన్ ?

విమానం మాదిరిగా రిజర్వేషన్ ?

రైల్వేలో ఈ కొత్త విధానం విమాన సేవల మాదిరిగా ఉంటుందని తెలిపారు. రైళ్లలో సీటింగ్ లేఅవుట్ ను కూడా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో చూపిస్తోంది. అంతేకాదు సీట్లు బుక్ అయితే అయినట్టు, ఖాళీగా ఉంటే బుక్ చేసుకోవాలనే సూచిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

English summary
In what will come as a huge relief to passengers, the Indian Railways has decided to allow changing of boarding station of reserved tickets as late a four hours before the departure time. According to existing rules, passengers are not allowed to change their boarding point beyond 24 hours ahead of the journey. Starting from May 1, this facility will be available to those who book their tickets online via the Indian Railway Catering and Tourism Corporation (IRCTC) website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X