వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సురక్షిత ప్రయాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ రైల్వేలు

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయ రైల్వేల్లో కొత్త సంస్కరణలు వచ్చాయి. రైళ్లలో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. అయితే 2017-18 సంవత్సరం నాటికి అవి తగ్గుముఖం పట్టాయి. ఎంతలా అంటే ఏడాదికి 73 రైలు ప్రమాదాలే చోటుచేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2013-14లో ఈ ప్రమాదాల సంఖ్య 118గా ఉన్నింది. అదే 2017-18 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 73కు పడిపోయి మొత్తం మీద ప్రమాదాల శాతం 62శాతానికి పడిపోయింది. దాదాపు 50శాతం మేరా ట్రాక్ మరమత్తులు లేదా కొత్త ట్రాకుల నిర్మాణం జరిగింది. 2013-14 సంవత్సరంలో 2,926 కిలోమీటర్ల మేరా ట్రాక్ పునర్నిర్మాణ పనులు జరిగితే...2017-18 సంవత్సరానికి నాటికి 4,405 కిలోమీటర్ల మేరా ట్రాక్ పునరుద్ధరణ పనులు జరిగాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మధ్యతరగతి వారికి ప్రయోజనాలు

మరోవైపు 14 ప్రీమియర్ రైళ్ల వేగం పెంచి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించింది రైల్వే శాఖ. సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఢిల్లీ నుంచి హౌరా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్, పట్నా ఢిల్లీ అమృత్ సర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచడం జరిగింది. ఇక అక్టోబర్ 2016 నుంచి దాదాపు 350 మెయిల్స్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు 74 సూపర్ ఫాస్ట్ రైళ్లు అంటే రాజధాని, శతాబ్ది రైళ్లు కరెక్ట్ సమయం కంటే ఐదు నుంచి 25 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకుంటున్నాయి. టైమ్ టేబుల్‌లో మార్పులు, సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టడంతోనే ఇది సాధ్యమైంది.

Indian railways ensures safe and hassle free travel

ఈ ఏడాది రైల్వేశాఖ ఆలిండియా రైల్వే టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. దీనిపేరు ట్రాన్సిట్ ఎట్ ఏ గ్లాన్స్ (ట్యాగ్). ఇది 15 ఆగష్టు 2018 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి అదనంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్లు తమ సొంతంగా టైమ్‌టేబుల్‌ను విడుదల చేసుకున్నాయి. (మొత్తం 5 జోనల్ టైమ్ టేబుల్లు, ప్రతి జోనల్ టైమ్ టేబుల్ 3-4 జోనల్ రైల్వేలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.). ఇక 2017-18లో 90 కొత్త సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగింది. 43 రైలు సర్వీసులను పొడిగించడం జరిగింది. మరో 9 రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడం జరిగింది. ఇక ప్రస్తుత సంవత్సరంలో అంటే 15 ఆగష్టు 2018 వరకు, 35 కొత్త రైలు సర్వీసులను ఇప్పటికే ప్రవేశ పెట్టడం జరిగింది. 28 రైలు సర్వీసులను పొడిగించారు. ఇక 5 రైలు సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచడం జరిగింది.

English summary
Safety and hassle free travel became the top priorities of the Indian Railways under the PM Modi government.After a string of accidents and heavy casualties since 2014, the year 2017-18 saw the number of accidents falling to 73 - the least ever. There was a 62% reduction in consequential train accidents from 118 in 2013-14 to 73 in 2017-18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X