వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: మేకిన్ ఇండియా మరి! గంటకు 180 కి. మీ వేగంతో పరుగెత్తే రైలింజన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

గంటకు 180 కి. మీ వేగంతో పరుగెత్తే రైలింజన్ ( వీడియో )

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి హయాంలో ఆరంభించిన మేకిన్ ఇండియా ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైలింజన్ పట్టాలు ఎక్కింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం ఆ ఇంజిన్ ప్రత్యేకత. ఈ ఇంజిన్ ను ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్ లో ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల ను అందుకుంది. రాజస్థాన్ లోని కోటా - సవాయ్ మధోపూర్ సెక్షన్‌ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

<strong>పోటెత్తిన తుంగభద్ర: సుంకేశుల గేట్లు ఎత్తివేత..శ్రీశైలానికి మరింత వరద ప్రవాహం</strong>పోటెత్తిన తుంగభద్ర: సుంకేశుల గేట్లు ఎత్తివేత..శ్రీశైలానికి మరింత వరద ప్రవాహం

ఈ ఇంజిన్ తయారు చేయడానికి 100 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్ షాప్ లో హైస్పీడ్ రైలు ఇంజన్లను తయారు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికత ఫలితంగా ఈ అద్భుతం సాధ్యపడిందని పియూష్ గోయల్ అన్నారు. మోడీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హైస్పీడ్ రైలు ఇంజన్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు. రైలు ప్రయాణ వ్యవధిని గణనీయంగా తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రయాణికులు ఇక తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు.

 Indian Railways manufacture high speed engine touching 180 km/hour

ఇదివరకు మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ ఇంజిన్ రహిత రైలును తయారు చేసిన విషయం తెలిసిందే. వందేభారత్ పేరుతో పట్టాలెక్కింది ఈ రైలు. ప్రస్తుతం ఢిల్లీ-వారణాశి మధ్య నడుస్తోంది. దీని గరిష్ఠ వేగం 120 కిలోమీటర్లు. ఇప్పటిదాకా ఇదే అత్యధిక వేగంతోొ పరుగులెత్తే రైలుగా పేరు నమోదు చేసుకుంది. తాజాగా ఈ 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు అందుబాటులోకి వస్తే.. దాని రికార్డు కనుమరుగౌతుంది. తాజాగా రైలింజన్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రావడానికి మరికొంత సమయం పడుతుందని పియూష్ గోయల్ అన్నారు.

English summary
Indian Railways has manufactured high speed locomotive touching a speed of 180 km per hour. The engine was developed under the 'Make in India' initiative in West Bengal's Chittaranjan Locomotive Works. This was shared by railway minister Piyush Goyal on microblogging site Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X