వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రయాణికులకు శుభవార్తే: ఇకపై టికెట్ బదిలీ చేసుకోవచ్చు

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భారత రైల్వే శాఖ మరో సౌకర్యాన్ని ప్రయాణికులకు అందిస్తోంది. ఇక నుంచి రిజర్వేషన్‌ టికెట్లను బదిలీ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకురానుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భారత రైల్వే శాఖ మరో సౌకర్యాన్ని ప్రయాణికులకు అందిస్తోంది. ఇక నుంచి రిజర్వేషన్‌ టికెట్లను బదిలీ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకురానుంది. ఈ విధానాన్ని తొలి దశలో ప్రధానమైన జంక్షన్లలో ప్రవేశపెట్టనున్నారు.

రిజర్వ్‌డ్‌ టికెట్‌ను బదిలీ చేయాలనుకున్న ప్రయాణికుడు.. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ను కలిసి దరఖాస్తు సమర్పించాలి. టికెట్‌ను ఎవరికి బదిలీ చేస్తున్నారు.. వారితో ఉన్న సంబంధం ఏమిటో తెలియజేస్తూ ధ్రువపత్రాల నకలు సమర్పించాలి. వీటిని పరిశీలించి సరైనవైతే.. పాత టికెట్‌పై పేరు మారుస్తారు. కొత్తగా టికెట్‌ ఇవ్వరు.

Indian railways now lets you transfer your reserved train ticket to another person

ప్రయాణికుల అభ్యర్థన(దరఖాస్తు) మేరకు తమ పేరుతో ఉన్న సీటు/బెర్త్‌ను రద్దు చేసి.. తమ కుటుంబంలోని ఎవరికైనా కేటయిస్తారు. విద్యార్థులు అయితే తాము చదువుతున్న సంస్థలోని విద్యార్థుల్లో ఎవరికైనా రిజర్వేషన్‌ టికెట్‌ను బదిలీ చేయవచ్చు. వీరు సంబంధిత సంస్థ ఉన్నతాధికారి నుంచి అభ్యర్థనను తీసుకుని రైలు బయలు దేరడానికి 48 గంటల ముందుగానే అధికారికి అందించాలి.

పెళ్లి బృందంలో ఎవరైనా ప్రయాణం రద్దు చేసుకుంటే వారి టికెట్‌ను మరొకరికి బదిలీ చేయొచ్చు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి 48 గంటల ముందుగా నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఇవ్వాలి. ఎన్‌సీసీ కేడెట్‌లు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టయితే.. సంబంధిత ఎన్‌సీసీ ఉన్నతాధికారి అభ్యర్థన మేరకు ఆ సీటు/బెర్త్‌ను వేరే కేడెట్‌కు 24 గంటల ముందుగా బదిలీ చేస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులు తమ రిజర్వేషన్‌ టికెట్‌ను తమ తోటి ఉద్యోగులకు 24 గంటల ముందుగా బదిలీ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం.. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్స్‌, కుటుంబంలోని సభ్యులకు మాత్రమే కల్పిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, వ్యాపారులకు అనుకూలంగా రాత్రి బయల్దేరి ఉదయం గమ్యం చేరుకునే (ఓవర్‌ నైట్‌) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డక్కర్‌ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

English summary
The Indian Railways will allow a passenger holding a confirmed reservation ticket to transfer it to other person. The railways has put certain conditions and the Chief Reservation Supervisor of important stations are authorised by Railway Administration to permit the change of name of a passenger having a reserved seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X