వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25శాతం-ఉచితం: విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన భారత రైల్వే

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతీయ రైల్వే సంస్థ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ వర్గాల విద్యార్థులకు వేర్వేరుగా భారీ రాయితీలు ప్రకటించింది. వివిధ అవసరాల దృష్ట్యా ప్రతి రోజు రైల్వేలో ప్రయాణిస్తున్న విద్యార్థుల కోసం 25 శాతం నుంచి పూర్తి ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపింది.

అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు.. అబ్బాయిలకు కూడా

అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు.. అబ్బాయిలకు కూడా

ప్రతి రోజు జనరల్‌ క్లాస్‌లో ఎమ్‌ఎస్‌టీ(నెల సీజన్‌ టికెట్‌/నెల పాస్‌ లాంటిది) మీద ప్రయాణించే అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది భారత రైల్వే. బాలికలు పాఠశాల విద్య నుంచి గ్రాడ్యుయేషన్‌ అయిపోయేంత వరకూ ప్రతి రోజు జనరల్‌ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అబ్బాయిలకయితే ఇంటర్‌ వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆఫర్‌ మదర్సాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.

50-75శాతం డిస్కౌంట్

50-75శాతం డిస్కౌంట్

మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ ధర మీద 75 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. అయితే ఇది జనరల్‌​ టికెట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
అంతేగాక, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటి పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ ధర మీద 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

వీరికి 50శాతం రాయితీ.. వారికి 75శాతం

వీరికి 50శాతం రాయితీ.. వారికి 75శాతం

ఇళ్లకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్‌ టూర్ల కోసం వెళ్లే విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. వీరికి స్లీపర్‌ క్లాస్‌ టికెట్స్‌ మీద 50 శాతం రాయితీ, ఎమ్‌ఎస్‌టీ లేదా క్యూఎస్‌టీ(మూడు నెలల పాస్‌లాంటిది)ల మీద 50 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే స్లీపర్‌ క్లాస్‌, ఎమ్‌ఎస్‌టీ, క్యూఎస్‌టీల మీద 75 శాతం రాయితీలను ప్రకటించింది.

పరిశోధనలకు 50శాతం.. ప్రొగ్రామ్స్ కోసం వెళ్లే వారికి 25శాతం..

పరిశోధనలకు 50శాతం.. ప్రొగ్రామ్స్ కోసం వెళ్లే వారికి 25శాతం..

పరిశోధనల నిమిత్తం ప్రయాణించే 35 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఏదైనా రిసెర్చ్‌ పని మీద వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ చార్జీ మీద 50 శాతం డిస్కౌంట్‌ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇది ఇలావుంటే, వర్క్‌ క్యాంప్‌, కల్చరల్‌ కాంపీటిషన్‌ ప్రొగ్రామ్‌లలో పాల్గొనేందకు వెళ్లే విద్యార్థులకు స్లీపర్‌ క్లాస్‌ ట్రెయిన్‌ టికెట్‌ చార్జీల మీద 25 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

మన విద్యార్థులకే కాదు విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు

మన విద్యార్థులకే కాదు విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు

మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాది ఒకసారి తీసుకెళ్లే స్టడీ టూర్‌ల కోసం జనరల్‌ క్లాస్‌ టికెట్‌ చార్జీల మీద 75 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇక భారతదేశంలో చదివే విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. భారతదేశంలో చదివే ఫారిన్‌ స్టూడెంట్స్‌, భారత ప్రభుత్వం నిర్వహించే ఏదైనా సెమినార్‌లకు హాజరయ్యేందుకు వెళ్లేటప్పుడు స్లీపర్‌ క్లాస్‌ టికెట్ల మీద 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. చారిత్రక ప్రదేశాల పర్యటనకు వెళ్లే విదేశీ విద్యార్థులకు కూడా ఇదే ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

శిక్షణ కోసం వెళ్లే విద్యార్థులకు 50శాతం రాయితీ

శిక్షణ కోసం వెళ్లే విద్యార్థులకు 50శాతం రాయితీ

భారతీయ రైల్వే సంస్థ క్యాడెట్‌, మెరైన్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌కు కూడా డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. నౌకాయాన లేదా ఇంజనీరింగ్‌ శిక్షణ కోసం వెళుతున్న విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ చార్జీల మీద 50శాతం రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం పూర్తయ్యే వరకూ వర్తిస్తుందని వెల్లడించింది. సీనియర్ సిటిజన్లు, వైద్యులు, రోగులకు కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కార్యాలయాలు, బుకింగ్ కార్యాలయాల వద్ద ఈ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

English summary
Indian Railways offers handsome discount on ticket fares to students travelling for certain purposes. These concessions are offered under certain categories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X