వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త:రైల్వే టిక్కెట్టును మరోకరికి బదిలీ చేయొచ్చు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం మరో సౌకర్యాన్ని కల్పించింది. ఒకరి పేరుతో రిజర్వేషన్ చేసుకొన్న టిక్కెట్టును మరోకరి పేరు మీద బదిలీ చేసుకొనే అవకాశం కల్పించింది. 24 గంటల్లోపుగా మరోకరి పేరున టిక్కెట్టును బదిలీ చేసుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటును కల్పించింది.

సుదూర ప్రయాణం కోసం రైల్ేవ టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకొన్న ఆ సమయానికి రైల్వే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే తాము బుక్ చేసిన టిక్కెట్టును వేరే వ్యక్తులకు బదిలీ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

Indian Railways passengers can now transfer their train ticket to someone else
ఒక వేళ టికెట్‌ రిజర్వు చేసుకున్న ప్రయాణికులు ప్రభుత్వోద్యోగులయితే రైలు బయల్దేరడానికి నిర్దేశించిన 24గంటల్లోపు తమ టికెట్‌ను వేరే ప్రయాణికుడి పేరు మీదకు మార్చమన్నట్లు లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలి.

సాధారణ ప్రయాణికులకు సైతం ఇలాంటి నిబంధనే ఉంది.. కాకపోతే ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు అంటే అమ్మానాన్నలకు, భార్య, సోదరులు, అక్కాచెల్లెల్లు, భర్త, కొడుకు, కుమార్తెలకు ఈ నియమం వర్తిస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. రైలు బయల్దేరడానికి 24గంటలలోపు ప్రయాణికులు ఈమేరకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులయితే... వారు టికెట్‌ను బదిలీ చేసుకోదలిస్తే సంబంధిత విద్యాసంస్థల అధికారి సంతకం చేయాల్సి ఉంది. రైలు బయల్దేరే 48గంటల్లోపు ఈ మేరకు సంతకంతో కూడిన అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది.

English summary
In a change that is sure to bring some relief to passengers, Indian Railways has now announced that it will allow passengers to transfer their confirmed ticket to another person in case they are unable to travel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X