వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

|
Google Oneindia TeluguNews

మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించటానికి వినూత్న కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది. భారత రైల్వే "మేరీ సహేలి" అనే మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో మహిళలు రైలు ప్రయాణాల్లో మేరీ సహేలి ఉందన్న ధీమాతో ధైర్యంగా ప్రయాణం చెయ్యవచ్చు.

Recommended Video

Indian Railways 'Meri Saheli' రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు శుభ వార్త...! || Oneindia Telugu

మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే .. దేశంలో తొలిసారి ..ఇది నిజంగా గుడ్ న్యూస్మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే .. దేశంలో తొలిసారి ..ఇది నిజంగా గుడ్ న్యూస్

మేరీ సహేలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ

మేరీ సహేలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ

"మేరీ సహేలి" కార్యక్రమం ద్వారా, రైళ్లలో ప్రయాణించే మహిళ ప్రయాణీకులకు వారి మొత్తం ప్రయాణంలో వారు ప్రారంభమైన స్టేషన్ నుండి గమ్య స్థానం అయిన స్టేషన్ వరకు మరింత భద్రతను కల్పించడం కోసం ఏర్పాటు చేసింది. దీనికోసం ఒక మహిళను ఆఫీసర్ మరియు సిబ్బంది బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు మహిళా ప్రయాణికులకు తగిన సలహాలు , సూచనలు ఇవ్వటమే కాకుండా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి రక్షణ కల్పిస్తారు .

మహిళల రక్షణకు మహిళా సిబ్బందితో టీమ్స్

మహిళల రక్షణకు మహిళా సిబ్బందితో టీమ్స్

మహిళా ప్రయాణీకులను గుర్తించడానికి ఈ బృందం లేడీస్ బోగీలతో సహా సహా అన్ని ప్రయాణీకుల బోగీలను సందర్శించి మహిళల వివరాలను సేకరిస్తుంది. ప్రత్యేకించి ఒంటరి మహిళలు రైళ్లలో ప్రయాణిస్తుంటే వారికి సంబంధించి తగిన రక్షణ కల్పించడంతోపాటు , వారికి ఆర్పిఎఫ్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 182, జిఆర్పి సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ 1512 లను ఇవ్వటమే కాకుండా ఇతర జాగ్రత్తలను కూడా ఈ టీమ్ వారికి చెబుతోంది. అపరిచితుల నుండి ఆహారాన్ని తీసుకోకూడదని, సామాను జాగ్రత్తగా చూసుకోవాలని, బంగారాన్ని ధరించి ప్రయాణం మంచిది కాదని ఇలా అనేక జాగ్రత్తలను ఈ సిబ్బంది మహిళలకు వివరిస్తారు.

రైళ్ళలో మహిళల వివరాల సేకరణ .. సూచనలు , సలహాలు

రైళ్ళలో మహిళల వివరాల సేకరణ .. సూచనలు , సలహాలు

ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే రైలు ఎస్కార్ట్ పార్టీని సంప్రదించడానికి వెనకాడవద్దని వారికి వివరిస్తారు. ప్రయాణికుల వివరాలను, వారి చివరి గమ్యస్థానానికి చేరుకునే వరకూ వారి రక్షణపై వీరు ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. ఇక ప్రయాణం చివరలో మహిళా ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని, వారి గురించి తీసుకున్న భద్రతా చర్యలపై అభిప్రాయాలను సేకరిస్తారు.

చాలా మంది మహిళా ప్రయాణికులకు రైళ్లలో భద్రత పై అవగాహన ఉండదు. అలాంటివారికి అవగాహన కల్పించడంతోపాటు గా మీకు అండగా మేమున్నామంటూ రైల్వే శాఖ మేరీ సహేలి పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

2020 సెప్టెంబర్ లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పైలెట్ ప్రాజెక్టుగా మేరీ సహేలి ... విశేష స్పందన

2020 సెప్టెంబర్ లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పైలెట్ ప్రాజెక్టుగా మేరీ సహేలి ... విశేష స్పందన

మేరీ సహేలి కార్యక్రమాన్ని 2020 సెప్టెంబర్ లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై మహిళా ప్రయాణికుల నుండి సానుకూల స్పందన వచ్చిన తర్వాత ఇది అన్ని రైల్వేజోన్ లకు విస్తరించారు

. సెంట్రల్ రైల్వే ఆర్‌పిఎఫ్ 24 ప్రత్యేక రైళ్లలో "మేరీ సహేలి" కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీనికి విశేషమైన సానుకూల స్పందన లభించింది. ఇందులో ముంబై-నాగ్‌పూర్-ముంబై దురాంతో ఎక్స్‌ప్రెస్, గోదాన్ ఎక్స్‌ప్రెస్, గోండియా-ముంబై స్పెషల్, ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్, పూణే-పాట్నా స్పెషల్ మరియు ఇతర రైళ్లు ఉన్నాయి.

మహిళా భద్రతలో ఎప్పుడూ ఇండియన్ రైల్వేస్ ముందంజ

మహిళా భద్రతలో ఎప్పుడూ ఇండియన్ రైల్వేస్ ముందంజ

మహిళలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఇండియన్ రైల్వే రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంది . మహిళా ప్రయాణీకుల భద్రత లో "మేరీ సహేలి" మరొక ముఖ్యమైన భాగం అవుతుందని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది.


ఇక రైళ్ళలో ఎంత దూరం ప్రయాణం అయినా మేరీ సహేలి తో మహిళలు చాలా సురక్షితంగా చెయ్యవచ్చు .

English summary
Indian Railways started another great initiative named "Meri Saheli" to provide more safety and security to women passengers during their entire journey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X