• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైళ్ల పున:ప్రారంభం : ప్రయాణికులకు ఈ నిబంధనలు తప్పనిసరి..

|

మూడో విడత లాక్ డౌన్‌లో ఎకనమిక్ యాక్టివిటీస్‌పై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం చాలావరకు కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా మే 12వ తేదీ నుంచి రైళ్లను కూడా నడపనుంది. దేశ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రైల్వేకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా క్రమంగా లాక్ డౌన్‌ను ఎత్తివేయడానికే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ సాయంత్రం 4గం. నుంచి రైల్వే బుకింగ్స్ మొదలుకానున్నాయి. అయితే మొదటి విడతలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లను నడపనున్న కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

  List of Train Services, Routes, New Rules : All You Need To Know

  Coronavirus: మందు, చిల్లీ చికెన్, ఫ్రెండ్స్ తో పార్టీ, ఒక్కడి దెబ్బకు ఊరు మొత్తం సీల్ డౌన్, క్యూ!

  టికెట్ ధర ఎలా ఉంటుంది..

  టికెట్ ధర ఎలా ఉంటుంది..

  ప్రస్తుతం కేవలం 15 రాజధాని రూట్లలో మాత్రమే కేంద్రం రైళ్లను అనుమతినిచ్చింది. ఇవన్నీ పూర్తి ఎయిర్-కండిషన్డ్. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలా కాకుండా.. పూర్తి స్థాయి సామర్థ్యంతో ఈ రైళ్ల నడవనున్నాయి. మే 11వ తేదీ సాయంత్రం 4గం. నుంచి www.irctc.co.in వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజధాని రైళ్లకు సూపర్ ఫాస్ట్ రైలు ఛార్జీలనే వసూలు చేయనున్నారు. టికెట్ ధర విషయంలో ఎవరికీ ఎలాంటి తగ్గింపు ఉండదు.

  గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలి...

  గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలి...

  రైల్వే స్టేషన్‌లోని కౌంటర్ల వద్ద ఎటువంటి టికెట్లు ఇవ్వరు. ప్రతీ ఒక్కరూ రైల్వే వెబ్ సైట్ నుంచే టికెట్‌ను బుక్ చేసుకోవాలి. టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు. ప్రయాణికులు నిర్ణీత సమయానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలి. టికెట్‌పై పేర్కొన్న సూచనలకు అనుగుణంగా అధికారులకు సహకరించాలి. ఫేస్ మాస్కులు ధరించడం,స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి. ఎటువంటి కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే రైల్లోకి అనుమతిస్తారు. ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఉండాలి. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయి తిరిగి పనులకు వెళ్లేవాలనుకునేవారి కోసం లేదా స్వస్థలాలకు వెళ్లేవాలనుకునేవారి కోసం ఈ రైళ్లను ప్రారంభించనున్నారు.

  రైల్లో బ్లాంకెట్స్ ఇవ్వరు..

  రైల్లో బ్లాంకెట్స్ ఇవ్వరు..

  దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, దిబ్రుగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి రూట్లలో ఈ 15 ఎయిర్ కండిషన్డ్ రైళ్లు నడుస్తాయి. ఇందులో ప్రయాణించేవారికి మునుపటిలా బ్లాంకెట్స్ ఇవ్వరు. బ్లాంకెట్స్‌తో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉండటంతో బ్లాంకెట్స్ సదుపాయాన్ని తొలగించారు. వీలైతే ప్రయాణికులే తమ సొంత బ్లాంకెట్స్‌ను క్యారీ చేసుకోవచ్చు. రైలు బోగీల లోపల ఎయిర్ కండిషనింగ్ కోసం ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంచబడతాయి.

  English summary
  As the lockdown moves towards the end of the third phase, Indian Railways has announced that it will gradually resume the services across routes from May 12. Bookings will be open on the IRCTC website at 4 pm today.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X