రైల్వే కీలక నిర్ణయం... పట్టాలెక్కనున్న మరో 90 రైళ్లు... ఇదిగో ఆ రైళ్ల జాబితా...
వచ్చే వారానికల్లా దేశంలో మరో 90 రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఈ రైళ్ల జాబితాను హోంమంత్రిత్వ శాఖకు పంపించగా.. ఇంకా ఆమోదం రావాల్సి ఉంది. ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ రాగానే వీలైనంత త్వరగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణ తేదీకి 120 రోజులు ముందుగా టికెట్ బుకింగ్స్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. కొన్ని సీట్లను తత్కాల్ కోటా కింద కూడా కేటాయించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ,కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

కేంద్రం అనుమతి కోసం పంపిన రైళ్ల వివరాలివే..
1.న్యూఢిల్లీ- అమృత్‌సర్- షాన్ ఏ పంజాబ్ ఎక్స్‌ప్రెస్ 2.ఢిల్లీ - ఫిరోజ్‌పూర్ - ఇంటర్‌సిటీ 3. కోటా-డెహ్రాడూన్-నందా దేవీ ఎక్స్‌ప్రెస్ 4. జబల్‌పూర్ - అజ్మీర్ - దయోదయ్ ఎక్స్‌ప్రెస్ 5. ప్రయాగ్‌రాజ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్ 6. గ్వాలియర్-మందుయాది-బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ 7. గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 8. పాట్నా - సికింద్రాబాద్ 9. గువాహతి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్

కేంద్రం అనుమతి కోసం పంపిన రైళ్ల వివరాలివే...
10. దిబ్రూఘర్- అమృత్‌సర్ 11. జోధ్‌పూర్ - ఢిల్లీ 12. కామాఖ్య - ఢిల్లీ 13. దిబ్రూఘర్ - న్యూఢిల్లీ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ 14. దిబ్రూఘర్ - లాల్‌ఘర్ 15. వాస్కో- పాట్నా ఎక్స్‌ప్రెస్
16. ఢిల్లీ సరాయ్ రోహిలీ- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ 17. ముజఫర్‌పూర్- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ 18. వడోదర వారణాసి మహమన ఎక్స్‌ప్రెస్ 19. ఉద్నా-దనాపూర్ ఎక్స్‌ప్రెస్ 20. సూరత్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 21. భగల్‌పూర్- సూరత్ ఎక్స్‌ప్రెస్ 22. వల్సాద్-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్

కేంద్రం అనుమతి కోసం పంపిన రైళ్ల వివరాలివే...
23. వల్సాద్ - ముజఫర్‌పూర్ శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ 24. గోరఖ్‌పూర్ - ఢిల్లీ హుమ్సాఫర్ ఎక్స్‌ప్రెస్ 25. ఢిల్లీ-భగల్‌పూర్ విక్రమ్‌శిల ఎక్స్‌ప్రెస్ 26. యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ 27. జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ 28. ఉదయ్‌పూర్- హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ 29. హబీబ్‌ఘంజ్- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ 30. లక్నో - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ 31. న్యూఢిల్లీ - అమృత్‌సర్ 32. ఇండోర్- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ 33. అగర్తలా- డియోఘర్ ఎక్స్‌ప్రెస్ 34. మధుపూర్- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ 35. యశ్వంత్‌పూర్ - భగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 36. మైసూర్ సోలాపూర్ గోల్గుంబజ్ ఎక్స్‌ప్రెస్ 37. కాన్సూర్ అన్వర్ గంజ్- గోరఖ్‌పూర్ చౌరిచౌర ఎక్స్‌ప్రెస్
38. బెనారస్- లక్నో క్రిషక్ ఎక్స్‌ప్రెస్ 39. ముజఫర్‌పూర్- ఆనంద్ విహార్ గరీబ్ రాత్ ఎక్స్‌ప్రెస్ 40. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఢిల్లీ- ఘాజీపూర్ సిటీ ట్రైన్ టు బలియా

అగస్టు 12 వరకూ మిగతా సర్వీసులన్నీ రద్దు...
అంతకుముందు,సుమారు 2 నెలల లాక్ డౌన్ తర్వాత మే 12 నుంచి రైల్వే శాఖ 30 రాజధాని రైళ్లను,200 ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లు మినహాయించి మిగతా రైళ్లన్నింటిని అగస్టు 12 వరకూ రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం తాజాగా మరిన్ని రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.