వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయి సరికొత్త రికార్డ్: డాలర్‌ మారకంతో రూ.73.33

|
Google Oneindia TeluguNews

ముంబై: రూపాయి పతనం సరికొత్త రికార్డులు సృష్టించింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరిగిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ. 73 మార్క్‌ను దాటింది.

బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మంగళవారం నాటి సెషన్‌లో 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. బుధవారం 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది.

Indian Rupee at fresh record low, now at 73.33 versus the US dollar

కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో రూపాయి మారకం విలువ 73.33గా కొనసాగుతోంది.

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

English summary
The Indian rupee opened at all time low 73.24 per dollar on Wednesday as it crossed 73 for the first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X