వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చారిత్రక కనిష్టస్థాయికి చేరిన రూపాయి మారకం: డాలర్‌కు రూ. 72.88

|
Google Oneindia TeluguNews

Recommended Video

కనిష్టానికి పడిపోతున్న రూపాయి విలువ....!

ముంబై: రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. బుధవారం ఆరంభంలోనే రికార్డ్‌ స్థాయిని చేరుకుంది. ఇన్వెస్టర్ల అంచనా వేసినట్టుగా 73 మార్క్‌కు చేరువలో ఉంది. డాలర్ మారకంలో రుపీ 72.86 స్థాయిని తాకింది. 41పైసలు క్షీణించి చారిత్రక కనిష్ట స్థాయికి దిగజారింది.

మరింత క్షీణించిన రూపాయి మారకం: రూ.72.66 మరింత క్షీణించిన రూపాయి మారకం: రూ.72.66

మరోవైపు రూపీ పతనం దేశీక ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కీలక సూచీ సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా క్షీణించి, నిఫ్టీ కూడా 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది. దీంతో బుధవారం కూడా మార్కెట్ల నెగిటివ్‌ ఓపెనింగ్‌ అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

Indian Rupee falls to new record-low 72.88 against US dollar

కాస్త కోలుకున్న మార్కెట్లు

వరుస భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు నేడు కాస్త కోలుకున్నాయి. స్వల్ప లాభాల్లో సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కాస్త పుంజుకున్నాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయి మళ్లీ ఒడుదొడుకులతో కొనసాగుతోంది. రూపాయి అంతకంతకూ క్షీణిస్తుండటంతో ఒత్తిడికి గురైన సూచీలు లాభాల్లో కొంత కోల్పోయాయి. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 75 పాయింట్ల లాభంతో 37,488 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,304 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

English summary
The rupee has slipped to a new record-low at 72.88 as compared to the US dollar on Wednesday amid renewed global trade war worries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X