వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..! కుష్టు వ్యాధి వ్యాక్సీన్ తో కరోనా కట్టడికి పరిశోధనలు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు అగ్ర దేశాలు అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వాక్సీన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా భారతదేశం కూడా అదే కోవలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో భయంకర అంటువ్యాధులకు మందులు కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు ప్రస్తుతం కరోనా వాక్సీన్ ను కనిపెట్టడం సవాల్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాక్సిన్ తయారీకి యువ శాస్త్రవేత్తలు తమ మేధో సంపత్తికి పదును పెట్టాలన్న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇచ్చిన పిలుపును స్పూర్తిగా తీసుకుని ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

 కరోనా వైరస్ కు విరుగుడు వాక్సీన్.. రంగంలోకి దిగిన భారత యువ శాస్త్రవేత్తలు..

కరోనా వైరస్ కు విరుగుడు వాక్సీన్.. రంగంలోకి దిగిన భారత యువ శాస్త్రవేత్తలు..

కరోనా వైరస్ కు విరుగుడు వాక్సిన్ కనుగొనేందుకు అగ్ర దేశాలైన అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలు శక్తి వంచన లేకుండా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాయి. ఏదేశం ముందుగా కనిపెడితే ఆదేశానికి ఎనలేని గుర్తింపు వస్తుందని భావిస్తున్న దేశాలు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా యువ భారత శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయత్నాలను ఉదృతం చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా విరుగుడు వాక్సిన్ కోసం కృషి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు యువ శాస్త్రవేత్తలు. కొందరు అధునాతన ప్రయోగాల కోసం శ్రమిస్తుండగా, మరికొంత మంది శాస్త్రజ్ఞులు గతంలో భారతదేశం కనిపెట్టిన వివిధ రకాల వాక్సిన్లకు పునఃపరిశోధనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 మేధోసంపత్తికి పదును పెట్టండి.. యువ శాస్త్రవేత్తలకు ప్రాధాని పులుపు..

మేధోసంపత్తికి పదును పెట్టండి.. యువ శాస్త్రవేత్తలకు ప్రాధాని పులుపు..

అందులో భాగంగా కుష్టు వ్యాధిని నిర్మూలించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో గతంలో విజయవంతంగా పనిచేసిన వ్యాక్సిన్‌ ను కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అనుగుణంగా పునఃపరిశోధనలకు శ్రీకారం చుడుతున్నారు భారత శాస్త్రవేత్తలు. అందుకోసం అలుపెరగని పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కుష్టు వ్యాధి సమూల నివారణకు ఉపయోగపడ్డ వాక్సీన్ ను ప్రస్తుత కరోనా కట్టడికి ఉపకరించేలా నూతన ప్రయోగాలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతులతో కుష్టు వ్యాధిని సమూలంగా నియంత్రించిన ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ప్రారంభించినట్టు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి అధికారులు ప్రకటించారు.

 కుష్టు వ్యాధిని నిర్మూలించిన వాక్సీన్ పై పునఃపరిశోధన.. భారత యువ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..

కుష్టు వ్యాధిని నిర్మూలించిన వాక్సీన్ పై పునఃపరిశోధన.. భారత యువ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం..

ఇదిలా ఉండగా కరోని కట్టడి వ్యాక్సిన్‌ తయారీ ఎంతో సుధీర్ఘ ప్రయోగమని, చాలా రోజులు సూక్ష్మ పద్దతిలో పరిశోధించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ప్రాణాంతక కుష్టు వ్యాధిని గతంలో సమర్ధవంతంగా అరికట్టిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం పునఃపరిశోధనలు కొనసాగిస్తున్నామని యువ శాస్త్ర వేత్తల బృందం స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రెండు కీలకమైన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టు వారు వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే ప్రయోగాలను ప్రారంభించి, కేవలం నెల, నెల పదిహేను రోజుల్లో ఆశించిన ఫలితాలను రాబడతామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది యువ శాస్త్రవేత్తల బృందం.

 అగ్ర దేశాలతో పోటీ పడుతున్న భారత్.. కరోనా వాక్సీన్ కనిపెట్టడంలో వేగవంతమైన ప్రయోగాలు..

అగ్ర దేశాలతో పోటీ పడుతున్న భారత్.. కరోనా వాక్సీన్ కనిపెట్టడంలో వేగవంతమైన ప్రయోగాలు..

కాగా కరోనా వ్యాక్సిన్‌ ను కనిపెట్టేందుకు సంవత్సర కాలం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ప్రకటించింది. ఐతే ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాల్లో 24 లక్షల మందికి సోకిన ఈ ప్రాణాంతక వైరస్ నిరోధానికి అమెరికా, చైనా సహా పలు దేశాలు వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు వేగంగా ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాక్సీన్ కనిపెట్టడంలో జర్మనీలో కొనసాగుతున్న ప్రయోగాలే కరోనా వాక్సిన్ విషయంలో కీలకమని, గతంలో ఎన్నో పరిశోధనలు ఈ అంశాన్ని నిర్దారించినట్టు స్పష్టమవుతోంది. ఐతే ప్రధాని పిలుపు మేరకు కరోనాకు వాక్సిన్ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన భారత శాస్త్రవేత్తలు, కరోనా పుట్టుపూర్వోత్తరాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు. దాని ఆధారంగా వాక్సీన్ ను కనిపెట్టబోతున్నట్టు యువ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేస్తోంది.

Recommended Video

Fake News Buster : 07 'హెలికాఫ్టర్ నుంచి ప్రజలకు డబ్బులు జారవిడుస్తున్న ప్రభుత్వం' ఇందులో నిజమెంత ?

English summary
The top countries seem to be making an effort to find an antidote to the deadly pandemic corona virus. While countries like the US, Germany, China and Australia are pushing for the vaccine, India seems to be falling into the same category. Indian scientists who have invented drugs for serious infections like leprosy in the past now re-experimenting for corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X