హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ ఫోటోలు.. మన సైంటిస్టులు ఎలా తీశారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని సరిగా గుర్తించలేకపోవడంతో అసలు దాని స్వభావమేంటన్నది అంతుచిక్కడం లేదు. మానవ ప్రయత్నంగా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు.. దాని మూలాలను కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్టులు కరోనా వైరస్ ఛాయ చిత్రాన్ని బయటకు విడుదల చేశారు.

ఎలా గుర్తించారు..

ఎలా గుర్తించారు..

ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మెక్రోస్కోపి ఇమేజింగ్‌ ద్వారా భారత్‌లో నమోదైన మొట్టమొదటి కరోనా పాజిటివ్ పేషెంట్ గొంతు నుంచి కరోనా వైరస్‌గా పేరు గాంచిన(Sars-CoV-2) వైరస్ తాలుకు చిత్రాలను సేకరించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) తమ తాజా ఎడిషన్‌లో ఈ విషయాలను ప్రచురించింది. ఒక ప్రత్యేక మెక్రోస్కోప్‌ను ఉపయోగించి చేసిన పరిశోధనల్లో తాము వైరస్‌ను గుర్తించగలిగామని జర్నల్‌లో సైంటిస్టులు పేర్కొన్నారు.

వైరస్ ఆకారం..

వైరస్ ఆకారం..

ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పరిణామ క్రమం,దాని రూపాంతరం,నిర్మాణం తదితర అంశాలపై సంపూర్ణ స్పష్టత రాలేదు. తాజాగా ఇండియన్ సైంటిస్టులు.. కరోనావైరస్ లాంటి కణాల లక్షణాలను కలిగి ఉన్న మొత్తం ఏడు నెగటివ్ స్టెయిన్ వైరస్ కణాల నమూనాలను చిత్రీకరించారు. ఒకసారి ఆ చిత్రాలను పరిశీలిస్తే.. వైరస్ గుండ్రని ఆకారంలో ఉండటాన్ని గమనించవచ్చు. అందులో కరోనా వైరస్ కణాల ఉపరితలం నుండి బయటకొచ్చే కాండం లాంటి ఆకారాలను కూడా గమనించవచ్చు.

వైరస్ ఆకారం..

వైరస్ ఆకారం..

ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పరిణామ క్రమం,దాని రూపాంతరం,నిర్మాణం తదితర అంశాలపై సంపూర్ణ స్పష్టత రాలేదు. తాజాగా ఇండియన్ సైంటిస్టులు.. కరోనావైరస్ లాంటి కణాల లక్షణాలను కలిగి ఉన్న మొత్తం ఏడు నెగటివ్ స్టెయిన్ వైరస్ కణాల నమూనాలను చిత్రీకరించారు. ఒకసారి ఆ చిత్రాలను పరిశీలిస్తే.. వైరస్ గుండ్రని ఆకారంలో ఉండటాన్ని గమనించవచ్చు. అందులో కరోనా వైరస్ కణాల ఉపరితలం నుండి బయటకొచ్చే కాండం లాంటి ఆకారాలను కూడా గమనించవచ్చు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
పీసీఆర్ ధ్రువీకరణ

పీసీఆర్ ధ్రువీకరణ

ఈ వైరస్ చిత్రాలను పాలిమర్స్ చైన్ రియాక్షన్ (పిసిఆర్)తో ధ్రువీకరించారు. పాలిమర్స్ చైన్ రియాక్షన్ అనేది పరమాణు జీవశాస్త్రంలో విస్తృతంగా ఉపయోగించబడే ఒక పద్ధతి. దీని ద్వారా నిర్దిష్ట DNA నమూనా నుంచి మిలియన్ల నుండి బిలియన్ల నమూనాలను వేగంగా సేకరించవచ్చు. ఒక చిన్న డీఎన్ఏ నమూనాతో సైతం విస్తృత అధ్యయనం చేయవచ్చు. ఏదేమైనా ఇప్పటికీ వైరస్ కచ్చితమైన నమూనాలను,దాని జన్యు పరిణామ క్రమాలను కనిపెట్టే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలు ఎంత త్వరగా పూర్తయి సత్ఫలితాలనిస్తే.. అంత త్వరగా వ్యాక్సిన్ తయారీకి అవకాశం ఉంటుంది.

English summary
A group of Indian scientists have taken images of the novel coronavirus using a specialised microscope. The images taken by the scientists show the round shape of the virus as well as projections or stalks jutting out from the surface of the novel coronavirus particles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X