వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40గంటలు..1500 యోగాసనాలు: గిన్నిస్ రికార్డు సృష్టించిన ఇండియన్

|
Google Oneindia TeluguNews

హాంకాంగ్: ప్రపంచ వ్యాప్తంగా ప్రచూర్యం పొందుతున్న యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఓ భారతీయుడు. హాంకాంగ్‌లో నిరంతరాయంగా 40గంటలు 1500 యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డులకెక్కాడు. యోగాపై విస్తృత ప్రచారం చేపట్టే పనిలో భాగంగా ఆయన ఈ సరికొత్త రికార్డు సృష్టించాడు.

తమిళనాడుకు చెందిన సిపి యోగారాజ్ (29) 12ఏళ్ల నుంచి యోగా సాధన చేస్తున్నారు. 2003 నుంచి హాంకాంగ్‌లో యోగా టీచర్‌గా కొనసాగుతున్నారు. ఇటీవలే ఐక్యరాజ్యసమితి యోగా ఆవశ్యకతను గుర్తించి.. జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో దానిపై యోగారాజ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో సరికొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు 40గంటల పాటు 1500 యోగాసనాలు వేసి.. గిన్నిస్‌లో చోటు దక్కించుకున్నారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపురావడానికి కారణమైన భారత ప్రధాని నరేంద్రమోడీకి తన రికార్డును అంకితం చేస్తున్నట్టు యోగారాజ్ ప్రకటించారు.

Indian sets Guinness record for performing Yoga for 40 hours non-stop
English summary
A 29-year-old Indian yoga teacher in Hong Kong on Sunday set a Guinness World Record for performing Yoga continuously for 40 hours non-stop, demonstrating more than 1,500 'asanas'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X