వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆటవిక దాడి: భారత జవాన్లపై మేకులు గుచ్చిన ఇనుప రాడ్లతో విరుచుకుపడ్డారా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని భారత్ చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైనిక బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో వాడిన ఆయుధాలేంటీ? ఎలాంటి మారణాయుధాలను ఉపయోగించారు? ఒకేసారి 20 మంది భారతీయుల ప్రాణాలను తీయడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసింది? కాల్పులు చోటు చేసుకున్నట్లు ఎవ్వరూ నిర్ధారించలేదు. మరి.. ఈ ఘర్షణల్లో వాడిన ఆయుధాలు ఎలాంటివి? రాళ్లు రువ్వుకుంటే అంతమంది ప్రాణాలను కోల్పోవడానికి అవకాశం ఉందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రశ్నలు ఇవి.

ప్రతి ఒక్కరిలోనూ దీనికి సంబంధించిన అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చైనా పీఎల్ఏకు చెందిన 45 మంది సైనికులు ఈ ఘర్షణల్లో మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. మరణాల సంఖ్యపై స్పష్టత లేదు. చైనా మిలటరీ కూడా దీన్ని ఎక్కడే గానీ అధికారికంగా ధృవీకరించలేదు. సోమవారం రాత్రి చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఘర్షణల్లో రెండు దేశాల తరఫున ఒకేసారి 65 మంది సైనిక బలగాలు ప్రాణాలను కోల్పోవడానికి పరస్పరం ఎలాంటి ప్రాణాంతక ఆయుధాలను వినియోగించారనే అనుమానాలకు జాతీయ మీడియా పుల్‌స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది.

 Indian soldiers were attacked by Chinese PLA with nail-studded rods

మేకులు గుచ్చిన ఇనుప రాడ్లతో చైనా సైనికులు వినియోగించారంటూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. పదునైన మేకులు గుచ్చిన రాడ్లతో వెనుక వైపు నుంచి భారత జవాన్లపై దాడులు చేశారని చెబుతున్నాయి. భారత్ చైనా భూభాగాలను వేరే చేసే వాస్తవాధీన రేఖ సమీపంలో గాల్వన్ వ్యాలీ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ప్రదేశం నుంచి ఆర్మీ అధికారులు ఈ రాడ్లను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రక్షణశాఖ అధికారులు గానీ ధృవీకరించ లేదు.

Recommended Video

#IndiaChinaFaceOff : Colonel Santosh Babu's Last Rites

మేకులు గుచ్చిన ఇనుప రాడ్లకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రాడ్లతోనే చైనా సైనికులు భారత జవాన్లను దొంగదెబ్బ తీశారని, వెనుకవైపు నుంచి భయానకంగా విరుచుకు పడ్డారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆటవికులు కూడా అలాంటి దాడులు చేయబోరని నిప్పులు చెరుగుతున్నారు. ఆధునిక కాలంలోనూ చైనా ఆటవిక రణనీతిని పాటిస్తోందంటూ మండిపడుతున్నారు. ఆటవికులు వినియోగాంచే మరణాయుధాలతో భారత సైనికులపై అమానవీయంగా దాడులు చేశారని, అకారణంగా 20 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
The Chinese Army used iron rods studded with nails to attack Indian Army soldiers hence proving that the assault was premeditated. A photograph of the improvised weapon is going viral on social media where multiple nail-studded iron rods can be seen. This image further shows that there was no intention on the part of the Chinese to retreat and de-escalate the situation.This savagery is similar to the tactics used by Pakistan's Border Action Team (BAT).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X