వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇండియన్స్ యూకే తప్ప అన్ని దేశాలకు వెళ్తున్నారు, భారతీయులు ఉద్యోగ సృష్టికర్తలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: యువత సాధికారత, యంగ్ లీడర్స్ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు ఎలా సహాయపడతారు అనే అంశంపై యంగ్ లీడర్స్ ఫోరమ్ సమావేశంలో గురువారం చర్చించారు. అలాగే సాంస్కృతిక అవగాహన పెంపొందించే అంశంపై చర్చించారు.

యున నేతలతో భేటీ సందర్భంగా ఓలా స్ట్రాటెజిక్ ఇనిషియేటివ్ హెడ్ ఆనంద్ షా మాట్లాడారు. మీ అనుభవం ఆధారంగా గుర్తింపు ఉండాలని చెప్పారు. మీ వృత్తి ఏదైనప్పటికీ అది మీకు పవర్ దిశగా ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. ఎవరైనా తాము పట్టిన మాతృభూమితో పాటు స్థిరపడిన భూమిని కూడా ప్రేమించాలని, రెండు దేశాలపై ప్రేమ ఉండాలన్నారు. ఇండియన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనలో ప్రతి ఒక్కరు సగం బ్రిటన్, సగం ఇండియన్ గుర్తింపు కలిగి ఉన్నామన్నారు.

Indian students are going every where but not to the UK

35 ఏళ్ల వయస్సులోపు గల యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్స్, ప్రొపెషనల్స్, పబ్లిక్ సెక్టార్ లీడర్లను ఉద్దేశించి కంబోడియాలోని ఇండియన్ హై కమిషనర్ దినేష్ కే పట్నాయక్ మాట్లాడారు. ఇండియన్స్ అంతా యాక్టివ్‌గా ఉండాలని, అందరిదీ ఒకే గొంతు కావాలన్నారు. మనలోని రాజకీయ నాయకులు కూడా దీనిని గ్రహించాలన్నారు.
యూకే ఇండియా కాన్‌క్లేవ్‌లో లాంచ్ చేసిన టెక్ ఎక్స్‌చేంజ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

దినేష్ ఓ గదిలో రాజకీయ పార్టీ మెంబర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు అంతటికీ వెళ్తున్నారని, కానీ యూకేకు మాత్రం ఎక్కువగా వెళ్లడం లేదన్నారు. యూకే యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని దేశాల విద్యార్థుల మొబిలిటీ బాగా ఉండాలన్నారు.

భారతీయ విద్యార్థులు చదువుకునేందుకు యూకే వస్తున్నారని, బ్రిటన్ స్టూటెండ్స్ ఇండియాకు రావడం లేదన్నారు. 95 శాతం లేదా ఎంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు తిరిగి ఇండియా వెళ్లే వీసా కలిగి ఉన్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఇండియా ఇంక్ సీఈవో మనోజ్ లాడ్వా మాట్లాడారు. ఈ సమావేశం ద్వారా మనం భారతీయులు ఉద్యోగాలు సృష్టించే వారు కానీ ఉద్యోగాలు తీసుకెళ్లేవారు కాదనే బలమైన నినాదం ఇచ్చామన్నారు.

English summary
The Young Leaders forum Conclave today was conducted to discuss the challenges against youth empowerment & how young leaders from the diaspora can help build stronger bilateral bridges & promote better cultural understanding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X