వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

H1B వీసాలు: భారీ సంఖ్యలో తిరస్కరణ..ఇండియన్ టెక్కీలకు దెబ్బ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికాలో భారత టెక్కీల జీవితాలు మరింత కష్టాలపాలవుతున్నాయి. ట్రంప్ సర్కార్ పెద్ద సంఖ్యలో హెచ్‌1 బీ వీసాలను తిరస్కరించడంతో వారికి పాట్లు తప్పడం లేదు. 2019-2020కి సంబంధించి పెద్ద సంఖ్యలో భారతీయ టెక్కీల వీసాలను అమెరికా ప్రభుత్వం తిరస్కరించిందని ఓ నివేదిక తెలిపింది. హెచ్1 బీ వీసాలను యూఎస్ సిటిజెన్‌షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పెద్ద సంఖ్యలో తిరస్కరించినట్లు నివేదిక వెల్లడించిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ ఒక నివేదిక విడుదల చేసింది. అదే సమయంలో అమెరికాలో పనిచేసేందుకు విదేశాల నుంచి వస్తున్న హెచ్‌1బీ వీసాలు 2015 నుంచి 2019కి దాదాపు 24 శాతం పెరిగాయని పేర్కొంది.

 భారత టెక్కీలకు దెబ్బ

భారత టెక్కీలకు దెబ్బ

2010 నుంచి 2015 మధ్య హెచ్‌1బీ వీసాలు చాలా తక్కువగా తిరస్కరించబడ్డాయని అయితే 2019-20లో మాత్రం అంతకు మూడు రెట్లు వీసాలకు అమెరికా ప్రభుత్వం నో చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. ఇలా హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తులు చేసుకున్నాక అవి తిరస్కరణకు గురికావడం టెక్కీలను కలవరపెడుతోంది.

అన్ని ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వీసాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఇలా మొత్తం 27 కంపెనీల పై స్టడీ చేసిన ఎన్ఎఫ్ఏపీ సంస్థ అందులో 12 సంస్థలు ఒక్క ఐటీ కంపెనీలే అని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాల్లో చూస్తే 30శాతం హెచ్‌1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం పక్కనపెట్టినట్లు సంస్థ చెబుతోంది. అయితే చాలా మటుకు వీసాలు సరైన డాక్యుమెంట్లు పొందుపర్చకపోవడంతోనే రిజెక్ట్ అయినట్లు నివేదిక స్పష్టం చేసింది.

 హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులవే

హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులవే

అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో అధికంగా భారతీయ టెక్కీలే నష్టపోతున్నారు. హెచ్1బీ వీసాలతో అమెరికాలో ఉన్నవారిలో 70శాతం మంది భారతీయులే ఎక్కువగా ఉంటారు. అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో వీరంతా పనిచేస్తున్నారు. అందులో ఎక్కువగా కాగ్నిజెంట్, యాక్సెంచర్, క్యాప్ జెమినీ, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలకు చెందిన ఉద్యోగుల హెచ్1బీ వీసాలే ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి.

అయితే హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనలు తీసుకురావడంతోనే అధికా సంఖ్యలో వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయని అదే సమయంలో అమెరికాలో ఇప్పటికే స్థిరంగా కొనసాగుతున్న భారతీయ టెక్ కంపెనీలు భారీగా నష్టపోతాయని స్టడీ హెచ్చరించింది.

 అమెరికాలో భారత్ కంపెనీలకు నష్టం

అమెరికాలో భారత్ కంపెనీలకు నష్టం

ఇక అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసిన భారతీయులకు హెచ్1బీ వీసాల ఆమోదంలో కాస్త సడలింపు ఉండటమే కాకుండా తొలి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇదే ఇప్పుడు భారత్‌లో మాస్టర్స్ చేసిన టెక్కీలను వేధిస్తోంది. ఇక తక్కువ సంఖ్యలో హెచ్‌1బీ వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల టాలెంట్ కూడా చాలావరకు తగ్గిపోయి అమెరికాలో ఉన్న భారతీయ టెక్ కంపెనీలను నష్టాల్లోకి నెట్టివేసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Donald Trump-led US administration is making life harder for Indian techies as it rejected a higher number of H1B visas in the third quarter of 2019-2020, according to a study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X