వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్కీ బైబిల్‌-2021లో ఇండియన్ విస్కీకి చోటు... ఆ విస్కీ ఏంటో తెలుసా...

|
Google Oneindia TeluguNews

గోవాలోని పాల్ జాన్ డిస్టిలరీలో తయారైన 'మిథున'... జిమ్ ముర్రే విస్కీ బైబిల్-2021 జాబితాలో టాప్-3 విస్కీగా చోటు సంపాదించుకుంది. గత దశాబ్ద కాలంలో సౌత్ ఏసియాకు చెందిన ఓ విస్కీ బ్రాండ్ విస్కీ బైబిల్‌లో చోటు సంపాదించుకోవడం ఇదే మొదటిసారి. 'మిథున' విస్కీని సేవించాక ఉండే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుందని ముర్రే పేర్కొన్నారు.

సెన్సేషనల్ చాకోలెట్,సుగంధ ద్రవ్యాలతో ఈ విస్కీకి అద్భుతమైన రుచి ఏర్పడిందని ముర్రే కితాబిచ్చారు. విస్కీ క్రిటిక్ అయిన ముర్రే.. మిథున విస్కీకి 100కి గాను 97 మార్కులు వేశారు.

 Indian whisky Paul John Mithuna ranks third in Jim Murrays Whisky Bible 2021

జాన్ డిస్టిలరీస్ ఎండీ పాల్ పి జాన్ మాట్లాడుతూ.. విస్కీ బైబిల్‌లో మిథునకు చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ విస్కీల కంటే అత్యుత్తమ విస్కీని ఇండియా ఉత్పత్తి చేయగలదని ఈ విస్కీ నిరూపించిందన్నారు. కాగా,రాశి చక్రంలోని 'మిథున' రాశి పేరు మీదు గానే దీనికి ఆ పేరు పెట్టారు.

విస్కీ బైబిల్ 2021 జాబితాలో కెనడియన్ అల్బర్టా ప్రీమియం కాస్క్ మొదటి స్థానంలో నిలిచింది. గతంలో 2006,2007,2008,2009లో ఇదే విస్కీకి కెనడియన్ విస్కీ ఆఫ్ ది ఇయర్‌గా ముర్రే కితాబిచ్చారు. ఇక రెండో స్థానంలో అమెరికన్ విస్కీ స్టాగ్ జూనియర్ బారెల్ ప్రూఫ్ నిలిచింది. విస్కీ బైబిల్ 2021 ఎడిషన్ కోసం విస్కీ గురు ముర్రే మొత్తం 1252 విస్కీలను రుచి చూశారు. ప్రతీ ఏటా ఇలాగే టాప్ విస్కీ బ్రాండ్ల జాబితాను విడుదల చేస్తాడు. గత ఏడాది టాప్-3 స్థానాలను అమెరికా విస్కీ బ్రాండ్లే ఆక్రమించాయి. ఈ మూడు విస్కీ బ్రాండ్లను తయారుచేసిన కంపెనీ(సాజెరక్) ఒకటే కావడం గమనార్హం.

English summary
Mithuna, from the Paul John distillery in Goa, has made it to the top three in Jim Murray's Whisky Bible 2021, topped by Beam Suntory’s Canadian Alberta Premium Cask Strength Rye.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X