వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ సర్వే: ఇండియన్స్ నో హ్యాపీ, మనకంటే పాకిస్తానీలే సంతోషంగా..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒక షాకింగ్ విషయం ఏమిటంటే.. భారతీయులు సంతోషంగా లేరట. భారతీయులకంటే పాకిస్తానీలే సంతోషంగా ఉన్నారట. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో ఈ షాకింగ్‌ విషయం వెల్లడైంది.

2017 నివేదిక సమయానికి భారత్‌ 4 స్థానాలకు పడిపోగా తాజాగా విడుదల చేసిన 2018 నివేదికలో ఏకంగా 11 స్థానాల కిందికి పడిపోయింది. మొత్తం 156 దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేయగా భారత్‌ 133వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

ఐక్యరాజ్య సమితి సర్వేలో...

ఐక్యరాజ్య సమితి సర్వేలో...

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకున్నా.. ఉగ్రవాద సమస్యలు లేకున్నా.. నిత్యం అభివృద్ధితో దూసుకెళుతున్నా, ప్రజలంతా శాంతియుత వాతావరణంలో బతికేస్తున్నా సర్వేలు నిర్వహించినప్పుడు మాత్రం ఎవరూ ఊహించని ఫలితాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రతి ఏడాది ఐరాసకు చెందిన ఎస్‌డీఎస్‌ఎన్‌ (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌) ఈ రిపోర్టు తయారు చేస్తుంది.

భారత్ కంటే పాకిస్తానే బెటర్?

భారత్ కంటే పాకిస్తానే బెటర్?

నిత్యం ఉగ్రవాదం సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌‌లోనే ప్రజలు ఆనందంగా, హాయిగా గడిపేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఎస్‌డీఎస్‌ఎన్‌ నివేదిక వెల్లడించింది. 2017లో ర్యాంకులు ప్రకటించినప్పుడే భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించిన పాకిస్తాన్ తాజాగా 2018 నివేదికలో కూడా అదే పైచేయి సాధించింది. అంతేకాదు గత ఏడాదికంటే మరో 5 ర్యాంకులు పైకి ఎగబాకింది. ప్రస్తుతం పాక్‌ 75వ ర్యాంకుతో భారత్‌కంటే చాలా ముందున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

అత్యంత సంతోషకరమైన దేశం.. ఫిన్‌లాండ్

అత్యంత సంతోషకరమైన దేశం.. ఫిన్‌లాండ్

విచిత్రం ఏమిటంటే.. భారత్‌కంటే చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంకవంటి దేశాలు కూడా సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్‌కంటే ముందుండడం. ఆర్థికంగా, సామాజికంగా అంత మాత్రంగానే ఉన్న వీరంతా భారతీయుల కంటే ఆనందంగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇక చైనా కూడా భారత్‌కంటే ఎంతో ముందుంది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జాబితాలో తొలిస్థానం ఫిన్‌లాండ్‌ దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో నార్వే, డెన్మార్క్‌ నిలిచాయి.

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకునే...

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకునే...

ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఏమిటంటే... 1. ఫిన్లాండ్‌, 2. నార్వే, 3. డెన్మార్క్‌, 4. ఐస్‌లాండ్‌, 5. స్విట్జర్లాండ్‌, 6. నెదర్లాండ్‌, 7. కెనడా, 8. న్యూజిలాండ్‌, 9. స్వీడన్‌, 10. ఆస్ట్రేలియా. అలాగే ప్రపంచంలోకెల్లా అత్యంత అసంతృప్తికరమైన దేశాలు... 1. మలావి, 2. హైతీ, 3. లిబేరియా, 4. సిరియా, 5. రువాండా, 6. యెమెన్‌, 7. టాంజానియా, 8. దక్షిణ సుడాన్‌, 9. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, 10. బురుండి. జీవన ప్రమాణాలు, సామాజిక మద్దతు, అవినీతి, సంతోషం స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించి, ర్యాంకులను కేటాయించారు.

ఫిన్‌లాండ్‌లో శీతల వాతావరణం ఉన్నా...

ఫిన్‌లాండ్‌లో శీతల వాతావరణం ఉన్నా...

స్వల్పస్థాయి సూర్యరశ్మి, శీతల వాతావరణం ఉన్నా ఫిన్‌లాండ్ వాసులు చాలా సంతోషంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ‘ఆర్థికంగా, రాజకీయంగా దేశంలోని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వ్యవస్థలో పునాదులు బలంగా ఉన్నట్టు భావిస్తున్నాం.. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే మేం సంతోషంగా ఉన్నాం..' అని ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకికి చెందిన సోఫియా హోల్మ్ అనే యువతి వ్యాఖ్యానించింది.

English summary
Indians, it appears, are getting unhappier by the year, while their not-so-well-off neighbours in Pakistan are becoming more joyful, shows the latest United Nations ranking of the world's happiest countries.India, which dropped four places in the 2017 World Happiness Report, fell a further 11 places in the 2018 report. It now ranks a low 133 on the list of 156 countries monitored by the United Nations' Sustainable Development Solutions Network for its annual 'joy' report. By comparison, terror-ravaged Pakistan, which was already 'happier' than India in the 2017 rankings, is shown as being even happier in the 2018 rankings. It's on number 75, up five spots from last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X